ఆ క్రికెటర్ చేసిన ఆ తప్పు వల్లే … KKR టీం లోకి కరోనా వచ్చిందా.?

ఆ క్రికెటర్ చేసిన ఆ తప్పు వల్లే … KKR టీం లోకి కరోనా వచ్చిందా.?

by Mohana Priya

Ads

ఎవరూ ఊహించని విధంగా ఐపీఎల్ ని అర్ధాంతరంగా ఆపేస్తున్నట్టు బోర్డ్ ప్రకటించింది. అసలు మొదట మే 3వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు, కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మధ్య  జరిగే మ్యాచ్ వాయిదా పడింది అని ప్రకటించారు. ఈ చర్చ అప్పటినుంచి మొదలయ్యింది. అందుకు కారణం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్స్ వరుణ్ చక్రవర్తికి ఇంకా సందీప్ వారియర్ కి కరోనా పాజిటివ్ రావడం.

Video Advertisement

Reason behind Varun Chakravarty testing positive for coronavirus

అయితే మ్యాచ్ మొదలయ్యే ముందు నుండి ప్లేయర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బయో బబుల్ లోనే ఉన్నారు. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా రావడం ఏంటి అని చర్చ మొదలైంది. ప్లేయర్స్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కోచింగ్ స్టాఫ్, ట్రావెల్ సిబ్బంది, కామెంటేటర్స్, మ్యాచ్ అధికారులని 7 రోజుల పాటు మూడు సార్లు కరోనా పరీక్షలు చేసి ఆ తర్వాత వారిని బయో బబుల్ లోకి చేర్చారు.

Reason behind Varun Chakravarty testing positive for coronavirus

దాంతో ఐపీఎల్ ముంబై, చెన్నై సిటీల్లో జరిగినా కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా ఐపీఎల్ బబుల్ లో నమోదు అవ్వలేదు. కానీ సోమవారం నాడు ఇద్దరికీ పాజిటివ్ రావడం బీసీసీఐ ని షాక్ కి గురి చేసింది. దాంతో వీరికి వైరస్ ఎలా సోకింది అనే విషయంపై బీసీసీఐ అధికారులు  దర్యాప్తు చేపట్టారు.

Reason behind Varun Chakravarty testing positive for coronavirus

సమయం కథనం ప్రకారం మొదట వరుణ్ చక్రవర్తికి వైరస్ సోకినట్టు  బీసీసీఐ అధికారులు నిర్ధారించారు. గత సంవత్సర కాలంగా వరుణ్ చక్రవర్తి భుజం గాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో గత గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌ తో మ్యాచ్ ముగిసిన తర్వాత అహ్మదాబాద్ లోని ఒక ఆస్పత్రికి వెళ్లారు. అలా వరుణ్ చక్రవర్తి బయో బబుల్ దాటి బయటికి వెళ్లారు అని తెలుస్తోంది.

Reason behind Varun Chakravarty testing positive for coronavirus

మామూలుగా అయితే బయో బబుల్ లో ఉన్నవాళ్ళు బయటి వ్యక్తి తో పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వకూడదు. రెస్టారెంట్ కి వెళ్లడం, క్యాబ్ లో ప్రయాణించడం కూడా నిషిద్ధం. బయటికి వెళ్ళినా టీం తోనే వెళ్ళాలి. అది కూడా బయో సెక్యూర్ బబుల్ ఉన్న ట్రావెల్స్ లోనే వెళ్ళాలి. వరుణ్ చక్రవర్తి ఆసుపత్రికి ఎలా వెళ్లారు? అక్కడ ఎవరిని కలిశారు? అక్కడే వరుణ్ చక్రవర్తికి కరోనా సోకిందా? అనే కోణంలో బీసీసీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

 


End of Article

You may also like