ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాల్లో ఒకటి ఉప్పెన. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించగా పంజా వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. వీరిద్దరికీ ఇది మొదటి సినిమా అయినా కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు అని ప్రేక్షకులు అభినందించారు. ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఉప్పెన సినిమాని ప్రశంసించారు. ఉప్పెన సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మేజర్ హైలైట్ గా నిలిచింది.

uppena

ఇవన్నీ మాత్రమే కాకుండా ఉప్పెనకి మరొక హైలైట్ విజయ్ సేతుపతి పర్ఫామెన్స్. విజయ్ సేతుపతి మన తెలుగులో చేసింది రెండు సినిమాలే. కానీ డబ్బింగ్ సినిమాల ద్వారా, అలాగే డైరెక్ట్ తమిళ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా ఎంతో పాపులారిటీ సంపాదించారు విజయ్ సేతుపతి. అయితే సినిమా చూసిన తర్వాత చాలా మంది విజయ్ సేతుపతి డబ్బింగ్ డిఫరెంట్ గా ఉంది అని అన్నారు.

reason behind vijay sethupathi dubbing in uppena

 

ఈ విషయంపై దర్శకుడు బుచ్చి బాబు సానా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా చెప్పారు. “విజయ్ సేతుపతి సర్ తన గొంతు ఈ క్యారెక్టర్ కి సూట్ అవ్వదు అని చెప్పారు. దాంతో మేము డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత డబ్బింగ్ చెప్పించాలి అని నిర్ణయించుకున్నాం. మేము ఎంతో మంది వాయిస్ ని పరిశీలించాం. వారిలో యాక్టర్ అజయ్ తో పాటు అంతకుముందు విజయ్ సేతుపతి కి డబ్బింగ్ చెప్పిన వారు కూడా ఉన్నారు.

reason behind vijay sethupathi dubbing in uppena

అప్పుడు బొమ్మాలి రవి శంకర్ గారిని అనుకున్నాం. సాధారణంగా రవి శంకర్ గారు ఒక్క రోజు కంటే తక్కువ సమయంలోనే డబ్బింగ్ పూర్తి చేస్తారు. కానీ ఈ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ కొంచెం కష్టంగా, ఇంటెన్స్ గా ఉండటంతో ఆయనకి మూడు రోజులు పట్టింది.

reason behind vijay sethupathi dubbing in uppena

రవి శంకర్ గారు బెంగళూరు నుండి హైదరాబాద్ కి వచ్చారు. ఒక్క రోజులో డబ్బింగ్ పూర్తి చేసుకుని అదే రోజు బెంగళూరుకి తిరిగి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నారు. కానీ పరిస్థితుల కారణంగా హైదరాబాద్ లో ఉన్న సాయి కుమార్ గారి ఇంటి నుండి బట్టలు తెచ్చుకొని డబ్బింగ్ ని మూడు రోజుల్లో పూర్తి చేశారు.” అని అన్నారు.