కొంతమంది నటులు చిరకాలం గుర్తుండిపోతారు. వారి యొక్క నటన, చేసిన పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి వాళ్ళలో హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నగేష్ ఒకరు.
Video Advertisement
అయితే నగేష్ జీవితంలో జరిగిన ఘటన చూస్తే ఇండస్ట్రీలో ఈగో ఎలా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. ఈయనకి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాక ముందు రైల్వే లో పని చేసేవారు.
కానీ చిన్నప్పటి నుండి నటన అంటే బాగా ఇష్టం. ఆ ఇష్టంతోనే నాటకాల్లో వేషాలు వేసేవారు. ఆ అనుభవంతోనే సినిమా రంగంలోకి రావాలని అనుకునేవారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొని తమిళ సినిమా రంగంలోకి నగేష్ అడుగు పెట్టడం జరిగింది. చిన్నచిన్న పాత్రలు చేసి మంచి నటుడిగా ఎదిగారు నగేష్.
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఆయన రావడం జరిగింది. అలా తాను ఇండస్ట్రీలో నిలబడ్డారు. అయితే అదే సమయంలో తమిళ స్టార్ హీరో ఎంజిఆర్ మరియు నగేష్ మధ్య కొన్ని మనస్పర్ధాలు జరిగాయి. ఎంజీఆర్ సెట్ లోకి రావడం.. నగేష్ లేచి నిలబడక పోవడం దీనికి కారణం. నగేష్ లేవకపోవడంతో ఎంజీఆర్ ఇగో బాగా హర్ట్ అయింది. దీనితో దర్శకనిర్మాతలకు నగేష్ కి సినిమా అవకాశాలు ఇవ్వొద్దని ఆయన చెప్పారు.
దీనితో ఆయనకు అవకాశాలు రాలేదు. తర్వాత నగేష్ తెలుగు సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు కమల్ హాసన్ తో ఈయనకి మంచి బంధం ఉండేది. దాని కారణంగా మళ్లీ తమిళంలో అవకాశాలు వచ్చాయి. ఆ తరవాత నగేష్ తన కొడుకుని తీసుకువచ్చి హీరోగా చేయాలని కూడా అనుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈయనకి రావడం, థియేటర్ ట్యాక్స్ కట్టలేకపోవడం జరిగాయి. అప్పుడు ఎంజీఆర్ సీఎం గా ఉన్నారు. నగేష్ కి ఉన్న థియేటర్ టాక్స్ కట్టలేకపోవడంతో ఆయనని జైలుకు పంపించారు.