పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో హరి హర వీర మల్లు ఒకటి. ఈ సినిమా మొదలు అయ్యి చాల కాలం అయ్యింది. కానీ సినిమా ఇంకా పూర్తి అవ్వలేదు. షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. మధ్యలో చాలా కాలం బ్రేక్ కూడా పడింది.

Video Advertisement

అయినా కూడా సినిమా బృందం సినిమాకి సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉండడంతో సినిమా మొదలు అయ్యి ఇంత కాలం అయినా కూడా ప్రేక్షకులకి ఆ సినిమా మీద ఆసక్తి అలాగే ఉంది.

ఒక సమయంలో సినిమా ఆగిపోతుంది అనే వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇది అంతా తప్పుడు ప్రచారం అంటూ సినిమా బృందం క్లారిటీ ఇచ్చారు. కానీ ఏదేమైనా సరే సినిమా ఆలస్యం మరీ ఎక్కువ అవుతూ ఉండడంతో అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ఆందోళన మాత్రం అందరిలో నెలకొంది. ఎందుకంటే ఈ సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా. పవన్ కళ్యాణ్ గత కొన్ని సంవత్సరాల నుండి ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి.

key actors are dropping from hari hara veeramallu..!!

దాంతో ఈ సినిమా డైరెక్టర్ తెలుగు సినిమా కాబట్టి కాస్త ఫ్రెష్ కాన్సెప్ట్ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల ఆలస్యం అవ్వడంతో అసలు సినిమా ఎప్పుడు వస్తుంది అనే ఆందోళన మొదలు అయ్యింది. ఈ విషయంపై ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం ఈ విధంగా చెప్పారు. ” హరి హర వీర మల్లు అనేది చాలా పెద్ద సినిమా. ఈ సినిమా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టాం.”

6 harihara veeramallu

“ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వాలి. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కాల్ షీట్స్ ఎక్కువగా ఇచ్చే పరిస్థితి లేదు. రీమేక్ సినిమాలు అంటే 15, 20 రోజుల్లో కంప్లీట్ అయిపోయేవి కాబట్టి ఒప్పుకున్నారు. కానీ ఈ సినిమాకి సెట్టింగ్స్ ఎక్కువగా వేయాలి. ఇది ఒక పిరియాడిక్ సినిమా. ఈ సినిమా చాలా మంచి సినిమా అవుతుంది” అని అన్నారు.

key actors are dropping from hari hara veeramallu..!!

ప్రస్తుతం వీరి బ్యానర్ లోనే కిరణ్ అబ్బవరం హీరోగా రూల్స్ రంజన్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్నప్పుడే ఏఎం రత్నం హరి హర వీర మల్లు సినిమా గురించి చెప్పారు. దాంతో ఫాన్స్ అందరు కూడా ఈ సినిమాకి ఏదో బాగా ప్లాన్ చేశారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ALSO READ : అట్టర్ ఫ్లాప్ అయిన ఆ “ప్రభాస్” సినిమాతో… కార్తీ సూపర్‌హిట్ కొట్టారా..?