హిందీ “జెర్సీ”ని “రష్మిక” ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా.? కారణం ఇదే.!

హిందీ “జెర్సీ”ని “రష్మిక” ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా.? కారణం ఇదే.!

by Megha Varna

Ads

రష్మిక మందన్నా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ మధ్య వచ్చిన పుష్పా సినిమాలో కూడా రష్మిక నటించి మంచి మార్కులు కొట్టేసారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా షాహిద్ కపూర్ నటించిన జెర్సీ ఈ నెల 22న విడుదల అయిన సంగతి తెలిసిందే.

Video Advertisement

ఈ సినిమాలో షాహిద్ కపూర్ అద్భుతంగా నటించారు. తెలుగులో నేచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా ఇది. దీనిని గౌతమ్ తిన్ననూరి హిందీ లో రీమేక్ చేశారు.

ఈ సినిమాలో షాహిద్ అద్భుతంగా నటించినప్పటికీ ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేక పోయింది. షాహిద్ సరసన మృణాల్ ఠాకూర్ నటించారు. అయితే మొదట రష్మిక మందన్నా ని షాహిద్ భార్య పాత్ర చేయమని అడిగారు.

కానీ దానిని రష్మిక మందన్నా రిజక్ట్ చేశారు. అయితే రష్మిక హిందీ జెర్సీ చిత్రానికి ఎందుకు నో చెప్పింది అనే దానిపై తాజాగా స్పందించారు. ఇక ఎందుకు ఈ ఆఫర్ ని రష్మిక రిజక్ట్ చేశారు అనే విషయానికి వస్తే.. ఇప్పటి వరకు రష్మిక మందన్నా కేవలం కమర్షియల్‌ సినిమాలే చేసారు. అయితే ఇప్పటి దాకా అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు జెర్సీ లాంటి చిత్రం లో నటిస్తే ఎలా ఉంటుంది అని అన్నారు.

పైగా జెర్సీ మంచి సినిమా కాదు అని నేను అనడం లేదు అన్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ తెలుగు జెర్సీ లో ఎంతో బాగా నటించారు. తనకన్న గొప్పగా ఎవరూ కూడా నటించ లేరు అని చెప్పారు రష్మిక. అందుకే ఈ పాత్రకు నేను కరెక్ట్‌ కాదని అనుకున్నానని… ఒకవేళ నేను చెయ్యాలి అనుకుంటే ఈ మూవీ లో పక్కాగా నటించే దానిని అని చెప్పారు. కానీ నా వల్ల దర్శక నిర్మాతలు నష్టపోకూడదు అని చెప్పారు. పైగా వారికీ నా కంటే బెటర్‌ ఆప్షన్స్‌ ఉండచ్చు కదా అని రష్మిక అన్నారు.


End of Article

You may also like