ఈ “5” కారణాల వల్లే పాకిస్థాన్ చేతిలో ఇండియా ఓడిపోయిందా..?

ఈ “5” కారణాల వల్లే పాకిస్థాన్ చేతిలో ఇండియా ఓడిపోయిందా..?

by Mohana Priya

Ads

ఎంతో ఉత్కంఠగా, దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలుస్తుంది అని చాలా మంది అనుకున్నారు. అందుకు మ్యాచ్ ముందు జట్టు వ్యక్తం చేసిన కాన్ఫిడెన్స్ కారణం. కానీ మ్యాచ్‌లో మాత్రం పరిస్థితి మొత్తం తలకిందులు అయ్యింది. అసలు ఇండియా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

Reasons behind India losing in Ind vs pak

#1 సోషల్ మీడియా అంతటా ఇండియా ఓడిపోవడానికి కారణం ఒకటే అని చెబుతున్నారు. అదే ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ పదం ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. కానీ ఒక సారి పరిశీలించి చూస్తే కేవలం ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రమే ఇండియా ఓటమికి కారణం కాదు అని తెలుస్తుంది.

Reasons behind India losing in Ind vs pak

#2 ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్ మొదలయ్యే ముందు టీం ఇండియా ప్లేయర్లలో ఎక్కడా ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించలేదు. ఈ మ్యాచ్ కోసం ఇండియా బెస్ట్ ప్లేయింగ్ 11 మందితోనే బరిలోకి దిగింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో తేమ (డ్యూ ఫ్యాక్టర్) వల్ల బ్యాటింగ్ తేలికైంది. అదే పాకిస్థాన్‌కి ప్లస్ అయ్యింది.

Reasons behind India losing in Ind vs pak

#3 ఇన్నింగ్స్ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు తీసి పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయించింది. ఇంక బ్యాటింగ్ సంగతి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కి సహకరించడంతో పాకిస్థాన్ ఓపెనర్లు పరుగులని సునాయాసంగా తీయగలిగారు.

Reasons behind India losing in Ind vs pak

#4 జట్టు ఓడిపోవడానికి విరాట్ కోహ్లీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా ఒక కారణం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఛేదనకి దిగినప్పుడు, అసలు ఫాంలో లేని భువనేశ్వర్‌తో మొదటి ఓవర్‌ని విరాట్ కోహ్లీ వేయించడం పెద్ద తప్పిదం అని కామెంటేటర్లు చెప్పారు. భువీకి వరుసగా 4,6 బాదిన రిజ్వాన్, ఫస్ట్ ఓవర్లోనే తన కాన్ఫిడెన్స్ పెంచుకున్నారు. భువనేశ్వర్‌తో కాకుండా ఖచ్చితమైన యార్కర్లని సంధించే జస్ప్రీత్ బుమ్రాతో మొదటి ఓవర్ వేయించి ఉంటే బాగుండేది అని అన్నారు. అలాగే సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ లేకుండా టీమిండియా బరిలోకి దిగడం కూడా తప్పు అని అంటున్నారు విమర్శకులు. పాకిస్తాన్ ఆరుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించగా, టీమిండియా మాత్రం ఐదుగురితోనే బౌలింగ్ చేయించాల్సి వచ్చింది.

Reasons behind India losing in Ind vs pak

#5 హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నా కూడా, అతనిని కొనసాగించి తప్పు చేశారు. 8 బంతులు ఆడిన హార్దిక్ పాండ్యా, కేవలం 11 పరుగులు చేశారు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే హార్దిక్ పాండ్యా చాలా అసౌకర్యంగా కనిపించారు. ఆ తర్వాత గాయం కారణంగా ఫీల్డింగ్‌కి రాలేదు. పాండ్యాకి బదులు ఆల్‌‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌ని తుది జట్టులోకి తీసుకొని ఉంటే బాగుండేది అని కామెంటేటర్లు అన్నారు.

Reasons behind India losing in Ind vs pak

టీం ఇండియా ఓడిపోవడానికి కారణాలు ఇవే అని పలు విమర్శకులు తమ అభిప్రాయాలను ఈ విధంగా వ్యక్తం చేశారు.


End of Article

You may also like