Ads
నందమూరి తారకరత్న అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. మోహనకృష్ణ- శాంతి దంపతులకు 1983 , ఫిబ్రవరి 22వ తేదీన ఆయన జన్మించారు. ముందు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా, సినిమాల్లో తగిన గుర్తింపు రాకపోవడంతో ఇక రాజకీయాలలో యాక్టివ్ కావాలని తారకరత్న ప్రయత్నించారు. కానీ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజుల పాటు చావుబతుకుల మధ్య పోరాటం తర్వాత శనివారం రాత్రి కన్నుమూశారు. విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో తారకరత్నకు ప్రత్యేక చికిత్స అందించినా.. ఫలితం లేకుండా పోయింది.
Video Advertisement
జనవరి 26న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఈ క్రమంలో లోకేష్‌తో పాదయాత్ర చేస్తూ తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయన్ను హాస్పిటల్ కి తరలించేందుకు 45 నిమిషాలు పట్టింది. అయితే ఆ సమయం లో ఆయన గుండె ఆగిపోయింది. తరువాత వైద్యులు ప్రయత్నం చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారు. అయితే తారకరత్న గుండెపోటుకు గురైన సమయంలో మెదడుకు దాదాపు 45 నిమిషాల పాటు రక్త ప్రసరణ ఆగిపోయిందని వైద్యులు గుర్తించారు.
అలా ఆగిపోవడం వల్ల మెదడులోని కొంత భాగం దెబ్బతింది. ఇక మెదడులో నీరు చేరడం వల్ల ఆ రికవరీ ప్రాసెస్ కి ఇబ్బంది ఏర్పడిందని తేలింది. ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి తారకరత్న కోలుకునేందుకు వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. గుండె, కాలేయం మెరుగుపడినప్పటికీ మెదడులోని కీలకమైన భాగం దెబ్బ తినడంతో తారకరత్న కోలుకోలేకపోయారని తెలుస్తోంది.
ఓ దశలో ఆయనను ఇక్కడి నుంచి విదేశాలకు తరలించి వైద్య సహాయం అందించాలని ముందుగా నిర్ణయించారు. ఆస్ట్రేలియా, లండన్ లేదా అమెరికా వంటి దేశాలకు తీసుకువెళ్లాలని భావించినా ఫ్లైట్లో అంతసేపు ట్రావెల్ చేయించడం కరెక్ట్ కాదని భావించి చివరికి ఆయా దేశాల నుంచి భారీ ఖర్చుతో నిపుణులైన వైద్యులను తీసుకువచ్చారు. చాలా రోజుల పాటు ఎక్మో సపోర్ట్ మీద ఉంచిన వెంటిలేటర్ సపోర్ట్ తో ఆయనను ఎక్కువ కాలం ఉంచినా బతికించలేకపోయారని తెలుస్తోంది.
End of Article