యశోద సినిమా టాక్ వెనక ఇంత జరిగిందా..??

యశోద సినిమా టాక్ వెనక ఇంత జరిగిందా..??

by Anudeep

Ads

హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించిన ‘యశోద’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా ఏకంగా ఐదు భాషల్లో ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాని హరి- హరీష్ దర్శకత్వంలో సరోగసి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించారు. ‘ఓ బేబీ’ తర్వాత సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Video Advertisement

తెలుగు రాష్ట్రాల్లో సమంతకి థియేటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం.శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటించారు. రిలీజైన ప్రతి చోట ఈ చిత్రానికి పాజిటీవ్‌ రివ్యూలు వస్తున్నాయి. యశోద కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని.. అలానే యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్, బీజీఎం చాలా బాగా కుదిరాయని టాక్.

REASONS BEHIND YASHODA MOVIE TALK..
అయితే అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత పై చాలా మంది నెగిటివ్ కామెంట్లు, ట్రోల్ల్స్ చేసారు. విడాకుల నేపథ్యంలో సమంత విషయంలో అక్కినేని ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. సమంతనే విడాకులు కోరిందని చైతూ అందుకే విడాకులు ఇచ్చాడని చాలామంది భావిస్తున్నారు. సమంత సినిమాలు రిలీజైన సమయంలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని అక్కినేని అభిమానులు భావించారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

REASONS BEHIND YASHODA MOVIE TALK..
అయితే యశోద సినిమా రిలీజ్ సమయంలో అక్కినేని ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారు. సమంతపై జాలి చూపించి ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల సమంత యశోద ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. సుమతో ఇచ్చిన ఇంటర్వ్యూ మినహా సమంత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. దీంతో సమంత పై, యశోద సినిమా పై పాజిటివిటీ బాగా పెరిగి పోయింది. మరోవైపు యశోద మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండగా క్రిటిక్స్ నుంచి రివ్యూలు సైతం అనుకూలంగా వస్తున్నాయి.


End of Article

You may also like