TS ELECTIONS RESULTS: ఈ 8 కారణాల వల్లే తెలంగాణాలో “BRS” ఓడిపోతుందా.? ఆ పేరు మార్చకుండా ఉండి ఉంటె.?

TS ELECTIONS RESULTS: ఈ 8 కారణాల వల్లే తెలంగాణాలో “BRS” ఓడిపోతుందా.? ఆ పేరు మార్చకుండా ఉండి ఉంటె.?

by Mounika Singaluri

Ads

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరస పెట్టి రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ కి మూడోసారి ఎన్నికల్లో ఓటమి ఎదురయింది. ఈరోజు వెలబడ్డ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ ను ఫామ్ చేస్తుంది.

Video Advertisement

అయితే ఎలక్షన్స్ జరిగిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పగా నేడు ఫలితాల్లో అదే రిపీట్ అయింది. అయితే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణాలని విశేషకులు అంటున్నారు.

1. ధరణి పోర్టల్:

ధరణి పోర్టల్ పేరుతో జరుగుతున్న అక్రమాలు బిఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ కొట్టాయి. ధరణి  వల్ల కౌలు రైతులు, పోడు రైతులు తీవ్రంగా నష్టపోయి భూస్వాములకి మేలు జరుగుతుందని విమర్శలు వచ్చాయి. చాలా చోట్ల ప్రజలకు పంచిన భూములు కూడా భూస్వాముల పేరు మీద చూపించడంతో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది.రైతుబంధు కూడా వారికే అందుతుందనే ఘటనలు కూడా ఉన్నాయి.

2. కాలేశ్వరం ప్రాజెక్టు:

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టులో బీటలు రావడం బిఆర్ఎస్ పార్టీకి మచ్చగా నిలబడింది. దీనికి తోడు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టులను అవినీతి పెరిగిపోయిందనే విమర్శలు కూడా వచ్చాయి.

3. నిరుద్యోగ సమస్య:

telangana group exams aspirants

తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు చెప్పిన ప్రభుత్వం పది సంవత్సరాల్లో చెప్పిన విధంగా ఉద్యోగాలు ఇవ్వలేదు. పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సరిగా ఇవ్వకపోవడం, నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్షలు క్యాన్సిల్ చేయడం పేపర్లు లేకేజిలు వంటివి బిఆర్ఎస్ కు నెగిటివ్ గా మారాయి.

4. పేరు మార్పిడి:

టీఆర్ఎస్ అంటే తెలంగాణ పార్టీ అని సొంత ఇంటి పార్టీ అన్నట్టు తెలంగాణ ప్రజలు భావించారు. బీఆర్ఎస్ గా పేరు మార్చడం…నేషనల్ పార్టీని చేయడం కొంత వ్యతిరేకతను తీసుకొచ్చింది అని ప్రజల అభిప్రాయం. గ్రామాల్లో ప్రజలకి టీఆర్ఎస్ గా పిలుచుకునే పార్టీని బీఆర్ఎస్ గా పేరు మార్చడం నచ్చలేదు అంట.

5. అసంతృప్తి/ప్రభుత్వ వ్యతిరేకత::

farmers 4

షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, రైతుబంధు, దళిత బంధు, బీసీ బంధులాంటి సంక్షేమ పథకాలు కేవలం అధికార పార్టీ అనుచరులకు మాత్రమే అందడం సామాన్య ప్రజలకు ప్రభుత్వం పైన అసహనాన్ని పెంచాయి. వరసగా రెండుసార్లు గెలవడం కొన్ని వర్గాల్లో అసంతృప్తిని పెంచాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి జరిగినా ప్రజలు కూడా అధికార మార్పు కోరుకోవడంతో కాంగ్రెస్ కి ఈసారి పట్టం కట్టారు. టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే తొమ్మిదినరేళ్లు అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. ఈసారి మార్పు కోరుకున్నారు తెలంగాణ ప్రజలు. బీజేపీ కూడా పోటీ చేసినా, ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు.

6. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే భావన తెలంగాణ ప్రజల్లో కలగడం:

కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష పార్టీగా బీజేపీని అనుకున్నారు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ లభించింది. బీఆర్ఎస్ , బీజేపీ…ఈ రెండు పార్టీలకి ఉమ్మడి ప్రత్యర్థి కాంగ్రెస్ కావడంతో…అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎక్కువగా కాంగ్రెస్ ని టార్గెట్ చేయడం, కేంద్రంలో పవర్ లో ఉన్న బీజేపీ కూడా కాంగ్రెస్ నే టార్గెట్ చేయడంతో..తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ , బీజేపీ రెండు ఒకటే అనే భావనలో పడ్డారు.ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలితే బీఆర్ఎస్ కి కలిసి వస్తుంది అనుకున్నారు. కానీ బీజేపీ కి అంతగా ఓట్లు రాకపోవడంతో బీఆర్ఎస్ లెక్క తప్పింది. కాంగ్రెస్ గెలుపుకి కారణమైంది.

 

7. బీఆర్ఎస్ అంటే ఒకటే కుటుంభం కావడం:

బీఆర్ఎస్ గెలిస్తే…కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన కొడుకు కేటీఆర్ , అల్లుడు హరీష్ రావ్ లకి మంత్రి పదవి రావడం. కేసీఆర్ కూతురు కవిత ఎమ్మెల్సీగా, కేసీఆర్ బంధువు సంతోష్ ఎంపీగా..ఇలా కీలక పదవులు అన్ని ఒకే కుటుంభంకి పరిమితం అవుతాయి అనే భావన తెలంగాణ ప్రజల్లో ఏర్పడి. మార్పు కోరుకొని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.

singer srirama chandra humble request to CM KCR..!!

8. వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్:

2014 లో ఘానా విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ, 2018 ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే పోటీ చేసింది. అయితే 2023 లో కూడా వాళ్ళకే టికెట్లు ఇచ్చి తప్పు చేసింది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ సారి చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పై ప్రజలు వ్యతిరేకభావంతో ఉన్నారు.

Also Read:తొలిరౌండ్ లో లీడ్ లో ఉన్నది వీళ్ళే…ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నాయా.?


End of Article

You may also like