ఈ మధ్య ప్రతి సినిమా కూడా వారి సొంత భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. అలా చాలా ప్రాంతీయ సినిమాలకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు దొరుకుతోంది. కొన్ని సంవత్సరాల వరకు కన్నడ ఇండస్ట్రీకి అంత పెద్దగా గుర్తింపు లేదు. కానీ కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యింది.

Video Advertisement

అలాగే ఆ తర్వాత వచ్చిన కాంతార సినిమా కన్నడ ఇండస్ట్రీ గుర్తింపుని ఇంకా పెరిగేలా చేసింది. దాంతో ఎన్నో కన్నడ సినిమాలు పాన్-ఇండియన్ సినిమాలుగా విడుదల అవుతున్నాయి. అందులో కొన్ని ప్రేక్షకులకి నచ్చుతూ ఉంటే, కొన్ని మాత్రం అంత మంచి రెస్పాన్స్ అందుకోవట్లేదు. అయితే ఉపేంద్ర కేవలం కన్నడ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా చాలా గుర్తింపు ఉన్న హీరో.

kabzaa movie review

ఉపేంద్ర సినిమాలు అంటే వేరే ఏ కన్నడ హీరోకి లేని క్రేజ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది. ఇప్పుడు ఉపేంద్ర హీరోగా నటించిన కబ్జ సినిమా అన్ని భాషల్లోనూ విడుదల అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ చూశాక సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. ట్రైలర్ చూసిన చాలా మంది ఈ సినిమాలో ఇటీవల చాలా పెద్ద హిట్ అయిన కేజిఎఫ్ అలాగే పుష్ప సినిమాల టచ్ ఉంది అని అన్నారు. సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి ప్రస్తుతం అంత మంచి టాక్ రావడం లేదు. అందుకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

umair sandhu review on kannada movie 'kabza'..

#1 ఒక సినిమా పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది అంటే ఆ రేంజ్ కంటెంట్ ఉంటుంది అని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అదే చాలా బలహీనంగా ఉంది అనే కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఒక సీన్ కి మరొక సీన్ కి సంబంధం లేకుండా నడుస్తూ ఉంటుంది. సినిమా మొత్తం హై అనిపించే ఒక్క సీన్ కూడా ఉండదు. అలా ఉన్న సీన్స్ కూడా అంతకుముందు మనం చాలా సినిమాల్లో చూసినట్టే ఉన్నాయి.

#2 ఒక సినిమాని వేరే భాషల్లో డబ్ చేసి విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు. డబ్బింగ్ లో కొంచెం అటు ఇటు అయినా కూడా సినిమా ఫీల్ పోతుంది. అలా ఇప్పటి వరకు చాలా సినిమాలు అయ్యాయి. ఎన్నో డబ్బింగ్ సినిమాల్లో మంచి సీరియస్ సీన్స్ డబ్బింగ్ వల్ల కామెడీ అయ్యాయి. ఈ సినిమాలో డబ్బింగ్ విషయంలో కూడా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ముఖ్య పాత్రలు పోషించిన నటులకి ఇచ్చిన వాయిస్ వారికి అస్సలు కరెక్ట్ గా లేదు అనే కామెంట్స్ వచ్చాయి.

kabzaa movie review

#3 ఈ మధ్య సినిమాల్లో పాటలు ఎలా ఉన్నా కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ సినిమాకి కేజిఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందించారు. సినిమాలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా నాయిస్ గా అనిపించింది. అసలు ఆ మ్యూజిక్ వల్ల సీన్ ఎలివేట్ అయ్యిందా లేదా అనే విషయం పక్కన పెడితే తల నొప్పి వచ్చేలాగా అనిపించింది. ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనే కామెంట్స్ వచ్చాయి.

kabzaa movie review

#4 సినిమా చూసిన వాళ్లు అందరూ కూడా కేజీఎఫ్ సినిమా 3 పార్ట్ ఇదే ఏమో అని అంటున్నారు. దాదాపు స్టోరీ లైన్ దగ్గరగా ఉంటుంది. అయితే కేజీఎఫ్ సినిమాలో కొన్ని సీన్స్ చాలా బాగా తెరపై కనిపించాయి. ఈ సినిమాలో సీన్స్ అన్ని రాసుకున్నప్పుడు బాగుండే ఉంటాయి కానీ, తెరపై చూపించే విషయంలో మాత్రం చాలా పొరపాట్లు జరిగాయి. దాంతో ఇంకా బాగా చూపించే అవకాశం ఉన్న సీన్స్ కూడా తెరపై చాలా వీక్ గా కనిపించాయి.

reasons for negative talk for upendra kiccha sudeep kabzaa movie

#5 ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంది అని చెప్పారు. హీరో సుదీప్ అందులో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు కూడా మనకి మొదటి పార్ట్ లో తెలిపారు. అయితే చాలా మంది, “అసలు ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉండాల్సిన అవసరం ఉందా?” అని అంటున్నారు. అంతే కాకుండా, “మొదటి పార్ట్ లో ఉన్న పొరపాట్లు మళ్లీ అందులో ఉండకుండా ఉంటే చాలు” అని అంటున్నారు.

reasons for negative talk for upendra kiccha sudeep kabzaa movie

ప్రస్తుతం అయితే ఈ సినిమాకి చాలా మిక్స్డ్ టాక్ వస్తోంది. కొంత మంది నిర్మాణ విలువలు, కాస్ట్యూమ్స్ అవన్నీ బాగున్నాయి అంటే, కొంత మంది మాత్రం అసలు సినిమా కథ అంతకుముందు మనం చాలా సినిమాల్లో చూసిన కథలానే ఉంది అని అంటున్నారు. మరి సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతోంది తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.