సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కాళిదాస రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందించారు. ఇందులో దేవ్ మోహన్ హీరోగా నటించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల అయ్యింది.

Video Advertisement

అయితే ఈ సినిమాకి ప్రస్తుతం అంత పెద్ద స్పందన రావట్లేదు. కొంత మంది సినిమా బాగుంది. కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతుంది అంటే, మరి కొంత మంది మాత్రం, చాలా ఆశలు పెట్టుకొని వెళ్ళాము. సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది అన్నారు. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

#1 సినిమా ట్రైలర్ విడుదల అయిన తర్వాత నుండి చాలా వరకు వచ్చిన కామెంట్స్ గ్రాఫిక్స్ మీద వచ్చాయి. సినిమా గ్రాఫిక్స్ చూస్తూ ఉంటే అదేదో సీరియల్ గుర్తొస్తోంది అని కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత, “అసలు గ్రాఫిక్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి? సెట్టింగ్ వేసి సినిమా తీయొచ్చు కదా? ఎందుకంటే గుణశేఖర్ అంటేనే సెట్టింగ్ కి ఫేమస్ కదా? అలాంటిది ఇంత గ్రాఫిక్స్ ఎందుకు వాడారు? ఒకవేళ వాడినా కూడా అవి గ్రాఫిక్స్ అని చాలా సులభంగా తెలిసిపోతోంది” అని అంటున్నారు.

shaakuntalam movie review

#2 ఈ సినిమా ముఖ్యంగా శకుంతల, దుష్యంత ప్రేమ కథ మీద నడుస్తుంది. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటే ఆ ప్రేమ కథ అంత బాగా కనిపిస్తుంది. కానీ అసలు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఉన్నట్టు అనిపించదు. వారి మధ్య పాటలు ఉంటాయి. ఎన్నో ఎమోషనల్ డైలాగ్స్ కూడా ఉంటాయి. కానీ ఏ ఒక్కటి కూడా చూస్తున్న ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ అయినట్టు అనిపించదు.

shaakuntalam movie review

#3 సినిమాలో యుద్ధం చేసే సీన్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా సీరియస్ గా నడుస్తూ ఉంటాయి. అవి చూసే ప్రేక్షకులకు మాత్రం అదంతా చాలా కామెడీగా అనిపిస్తుంది. అసలు యుద్ధం చేస్తున్నారా అని అనుమానం కూడా వస్తుంది.

#4 సినిమా ఈతరం ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అవుతుంది అని అన్నారు. అని ఇప్పటి తరం వాళ్లకి కనెక్ట్ అయ్యేలాగా ఒక్క పాయింట్ కూడా సినిమాలో కనిపించదు. డైలాగ్స్ అప్పటికి కాలానికి తగినట్టు ఉన్నా కూడా, అవి ఆ పాత్ర యొక్క ఎమోషన్ తెలపడానికి ఉపయోగపడడం కాకుండా కేవలం ఏదో డైలాగ్ చెప్పినట్టుగానే అనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఎవరు మాట్లాడుతున్నా కూడా ఏదో వారికి ఇచ్చిన డైలాగ్ చెప్పి వెళ్ళిపోతున్నారు ఏమో అన్నట్టే అనిపిస్తుంది.

shaakuntalam movie review

#5 సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. కొంత మంది అయితే అసలు సీన్ లో ఎందుకు ఉన్నారో కూడా అర్థం అవ్వదు. కొంత మంది నటీనటులని చూస్తూ ఉంటే ఆ పాత్రకి వాళ్ళు అస్సలు సూట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. అసలు అందరిలోనూ ముఖ్యంగా హీరో పాత్ర పోషించిన దేవ్ మోహన్ అయితే అసలు రాజు లాగా కనిపించలేదు అనే కామెంట్స్ వచ్చాయి. ఎవరైనా తెలుగు హీరోని తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అని అన్నారు.

shaakuntalam movie review

#6 సినిమాలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు అన్నట్టు చూపిస్తారు. హీరోయిన్ హీరోని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. కానీ అంత ప్రేమ కలగడానికి కారణం ఏంటి అనేది మాత్రం సరిగ్గా చూపించలేదు. ఒక ప్రేమ కథలో వారి పరిచయం ఎలా అవుతుంది, అది ప్రేమగా ఎలా మారుతుంది, అసలు హీరోయిన్ హీరోని అంతగా ఇష్టపడటానికి కారణం ఏంటి ఇలాంటివి చూపించడానికి ఎంత ఎక్కువ సమయం తీసుకున్నా కూడా ప్రేక్షకులు చూస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఏదో హడావిడిగా హీరోయిన్ హీరోతో అంత ప్రేమలో పడిపోతుంది అన్నట్టు చూపించారు అనే కామెంట్స్ వస్తున్నాయి.

reasons for shaakuntalam negative talk

ఏది ఏమైనా సరే ప్రస్తుతం అయితే ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది. కొన్ని వర్గాల ప్రేక్షకులకి సినిమా ఇలా అనిపిస్తుంటే, కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం చూడగలిగే సినిమా, బాగుంది అని అంటున్నారు.