టాలీవుడ్‌లో అంత మంది హీరోలు ఉన్నా… “చిరంజీవి” ఎందుకు అంత స్పెషల్..? చిరంజీవి “మెగాస్టార్” అవ్వడానికి 5 కారణాలు ఇవేనా..?

టాలీవుడ్‌లో అంత మంది హీరోలు ఉన్నా… “చిరంజీవి” ఎందుకు అంత స్పెషల్..? చిరంజీవి “మెగాస్టార్” అవ్వడానికి 5 కారణాలు ఇవేనా..?

by Mohana Priya

Ads

సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు సంపాదించుకొని ఒక స్టార్ హీరో అవుతారు. ఆ స్టార్ హీరోలలో కొంత మంది కూడా అసలు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి హీరో మరొకరు రారు ఏమో అనే అంత గుర్తింపు తెచ్చుకుంటారు.

Video Advertisement

అలా గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అసలు సినిమా అంటే ఏంటో పెద్దగా తెలియని ఒక కుటుంబంలో పుట్టి, సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ అయ్యారు. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చిరంజీవి అంటే చాలా మందికి ఒక ఉత్సాహం వస్తుంది.

chiranjeevi faces troubles in 2nd innings

తెలుగు సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్లిన వారిలో చిరంజీవి ఒకరు. ఏ కొత్త హీరో అయినా సరే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, “మీకు ఇండస్ట్రీకి రావడానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరు?” అంటే చాలా మంది చెప్పే వ్యక్తి చిరంజీవి పేరే. అసలు చిరంజీవి ఎందుకు ఇంత గొప్ప స్టార్ అయ్యారు? అసలు చిరంజీవిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన లాంటి హీరో ఇంకొకరు లేరా? భవిష్యత్తులో అయినా ఆయన లాంటి హీరో మరొకరు ఉండరా? చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికి కొన్ని కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

did megastar chiranjeevi changed his name

#1 అప్పటివరకు హీరో అంటే కేవలం నటించాలి అంతే. హీరోకి డాన్స్ రావడం, అది కూడా ఎంత బాగా డాన్స్ రావడం అనేది అంతవరకూ అరుదు. ఒకటి కాదు, రెండు కాదు. తెలుగు సినిమాల్లో అన్ని రకాల డాన్స్ లు చేసిన ఒకే ఒక్క హీరో కేవలం చిరంజీవి ఏమో. అది కూడా అంత స్టైల్ గా డాన్స్ చేసిన హీరోలు ఇప్పటి వరకు కూడా ఎవరూ లేరు.

#2 సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నెగిటివ్ పాత్రలో నటించారు చిరంజీవి. అలాంటి వ్యక్తి ఆ తర్వాత అలాంటి పాత్రలకు పూర్తిగా భిన్నమైన పాత్రలు పోషించారు. కామెడీ, సెంటిమెంట్, విలనిజం, రౌడీయిజం ఇలా ఎలాంటి పాత్ర అయినా సరే చిరంజీవి అవలీలగా చేసే వారు. ఇప్పటికి కూడా అలాగే చేస్తారు. అంటే చిరంజీవి మొదటి నుంచి కూడా తాను ఎంచుకున్న పాత్రల విషయంలో చాలా జాగ్రత్త వహించారు.

#3 ఒక పాయింట్ తర్వాత చిరంజీవికి కమర్షియల్ హీరో అనే ఒక ట్యాగ్ వచ్చింది. అలా అని చిరంజీవి ఆ ఇమేజ్ కి అంకితం అయిపోలేదు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే తనలోని నటుడిని బయటికి సినిమాలను కూడా చేస్తూ వచ్చారు. చిరంజీవి నటించిన చంటబ్బాయి, రుద్రవీణ, ఆపద్బాంధవుడు, స్వయంకృషి, అలాగే ఇటీవల వచ్చిన సైరా నరసింహారెడ్డి కూడా చిరంజీవిలోని గొప్ప నటుడిని బయటికి తెచ్చిన సినిమాలు. ఆ సినిమాల ఫలితం ఎలా ఉన్నా కూడా సినిమా చూసిన తర్వాత అందరూ చిరంజీవి నటనని మెచ్చుకుంటూనే ఉన్నారు. ఒక కమర్షియల్ హీరో అయ్యుండి కూడా ఇలాంటి సినిమాలు చేసి తాను ఒక సంపూర్ణ నటుడు అని నిరూపించుకున్నారు చిరంజీవి.

#4 ఒక స్టార్ అవ్వాలి అంటే తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక కూడా వారి ప్రవర్తన ఎలా ఉంటుందో అనేది జనాలు గమనిస్తారు. తాను పైకి నడుస్తూ తనతోపాటు తన తోటి వారికి కూడా చేయి అందిస్తూ వారిని కూడా గొప్ప స్థాయిలో చూడాలి అనుకునే వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటికి కూడా ఏ సినిమా అయినా సరే, పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా లేకుండా, తన వంతు ప్రోత్సాహం ఇస్తూ వారు కూడా గుర్తింపు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటారు చిరంజీవి.

#5 కేవలం అప్పటి తరం నటులకి మాత్రమే కాకుండా ఇప్పటి తరం నటులకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి. ఇప్పటికి కూడా తనకి ఉన్న ఇమేజ్ కి అతుక్కుపోకుండా, రీమేక్ సినిమాలు అయినా సరే మంచి కంటెంట్, అలాగే ఆ పాత్రకి తగ్గట్టు మారడం, తాను స్టార్ హీరో, ఎలా చేసినా సినిమా నడుస్తుంది అనే ఒక ఆలోచనని పక్కన పెట్టి ప్రతి సినిమాకి అంతే కష్టపడటం అనేది చిరంజీవిలో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏమో. ఇప్పటికి కూడా సైరా నరసింహారెడ్డి లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ, అలాగే వాల్తేరు వీరయ్య లాంటి కమర్షియల్ సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు చిరంజీవి.

minus points in chiranjeevi waltair veerayya title teaser

ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఎన్నో కష్టాలు పడ్డారు. తన లాగే హీరో అవ్వాలి అని ఇండస్ట్రీకి వచ్చే వారికి ఒక బాట వేశారు. అప్పుడే కాకుండా హీరో అయిన ఇన్ని సంవత్సరాలకి కూడా అంత మందికి స్ఫూర్తి ఇచ్చే రేంజ్ కి వెళ్ళారు అంటే, అంత దూరం వెళ్ళడం వెనుక ఎంత కష్టం ఉంది, అసలు ఎంత చూసి ఉంటే, ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఉంటే ఇప్పుడు ఇంత గొప్ప స్థాయికి ఎదిగారు అనేది చిరంజీవిని చూస్తే తెలుస్తుంది. అందుకే చిరంజీవి లాంటి హీరో మరొకరు ఉండరు ఏమో అనిపిస్తుంది. భవిష్యత్తు తరాలలో వచ్చే హీరోలకి కూడా చిరంజీవి గట్టి కాంపిటీషన్ ఇస్తారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.


End of Article

You may also like