Ads
యుక్త వయస్సులో ప్రేమించుకోవడం ఎంత కామన్ గా జరుగుతుందో ప్రేమలో విఫలం కావడం కూడా అంతే కామన్ గా జరుగుతుంది. కానీ ఏ బంధాన్ని ముగించాలని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరు తమ బంధాన్ని నిలుపుకోవాలని చాలా ప్రయత్నిస్తారు.
Video Advertisement
అయితే ప్రేమలో విఫలం అయితే అబ్బాయిలు అయితే కృంగిపోయి త్రాగుడుకి బానిస అయిపోతారు. కొంతమంది అమ్మాయిలు అయితే లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత కొన్ని రోజులు బాధపడిన కూడా తరువాత మరిచిపోయే ప్రయత్నం చేసి కొత్త జీవితం స్టార్ట్ చేస్తారు. అయితే ఒక బంధం బీటలు వారడానికి ఎన్నో కారణాలుంటాయి. ఇప్పుడు ఆ కారణాలేవో చూద్దాం..
#1 మీ భాగస్వామి లో లోపాలు వెతకడం
చాలా మంది ప్రేమలో ఉన్నప్పుడు తమలోని మంచి విషయాలనే చూపిస్తూ ఉంటారు. కానీ కాలం గడిచే కొద్దీ తమలో దాగి ఉన్న ప్రతి లక్షణాన్ని బయట పెడతారు. దీంతో భాగస్వామి లో అశాంతి, అసహనం మొదలవుతుంది. ఇది ఆ బంధాన్ని బలహీనం చేస్తుంది.
#2 భాగస్వామి నుంచి ఎక్కువ కోరుకోవడం
మన భాగస్వామి మనకి అది చెయ్యాలి, ఇది ఇవ్వాలి అని ఆశలు పెంచుకున్నట్లయితే చివరికి మనకి నిరాశ తప్పదు.
#3 నమ్మకం
నమ్మకం.. ఒక బంధానికి పునాదులు పడేది నమ్మకం నుంచి మాత్రమే. అదే మీ బంధాన్ని దృఢం చేస్తుంది. కానీ ఒకసారి మీ భాగస్వామి మిమ్మల్ని నమ్మడం మానేస్తే.. అది తిరిగి నిర్మించుకోవడం చాలా కష్టం.
#4 కమ్యూనికేషన్ గ్యాప్
ఒక బంధం లో ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ విషయం లో ఒక్కసారి దూరం వస్తే.. తిరిగి కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. లేదంటే దాని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఒక బంధం విడిపోవడానికి ఇది ఒక కారణం.
#5 గతం గురించి చర్చించడం
మీ భాగస్వామి గతం లో ఏవైనా తప్పులు చేసి ఉంటే.. వాటిని చర్చించి.. మీ భాగస్వామిని క్షమించి ముందుకు సాగాలి. కానీ ఆ తర్వాత వాటిని ఎత్తి చూపుతూ వారిని బాధ పెట్టకూడదు.
#6 ఆధిపత్య ధోరణి
తమ బంధం లో ఎప్పుడు తమదే పై చేయిగా ఉండాలి.. న మాటే ఇతరులు వినాలి అన్న స్వార్థం తో ఉంటే మరో వ్యక్తికీ బాధ తప్పదు.
#7 ఆర్థిక సమస్యలు
ఒక బంధం సుఖంగా.. సంతోషంగా సాగాలి అనుకుంటే దానిలో డబ్బు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆర్థిక పరమైన విషయాలను ముందుగానే చర్చించుకోవాలి. లేకుంటే దాని వల్ల ఇబ్బందులు తప్పవు.
#8 సంప్రదాయాల మధ్య బేధాలు
మన దేశం లో ఉన్న అనేక సంప్రదాయాల మధ్య బేధాల వల్ల కూడా ఒక బంధానికి అడ్డంకులు ఏర్పడవచ్చు.
End of Article