ఆ ఒక్క రీజన్ తోనే నాగచైతన్య అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేసారా?

ఆ ఒక్క రీజన్ తోనే నాగచైతన్య అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేసారా?

by Anudeep

Ads

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య కెరీర్ లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టమే పడాల్సొచ్చింది. బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు నాగ చైతన్యను యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకున్నారు. జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య.. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో మళ్ళీ ప్రయత్నాలు చేసారు.

Video Advertisement

ఆయన సినిమాల్లో ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నప్పటికీ.. కధలు ఎంచుకునే విధానంలో ఆయన ప్రత్యేకత కనబరిచారు. కొన్ని కొత్త కధలను ఎంచుకోవడం వలన కూడా ఆయనకు ఫ్యాన్స్ లో క్రేజ్ ఏర్పడింది.

nagachaitanya 1

అయితే.. నాగ చైతన్య తన కెరీర్ లో చాల మంచి మంచి సినిమాలనే రిజెక్ట్ చేసారు. ఏ మాయ చేసావే మంచి హిట్ టాక్ తీసుకురావడంతో పాటు నాగ చైతన్యకు లవర్ బాయ్ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చింది. అయితే.. ఆ ఇమేజ్ ను కాపాడుకుంటూనే నాగ చైతన్య లవ్ రిలేటెడ్ సినిమాలు తీస్తూ.. మరోవైపు మాస్ హీరోగా కూడా పేరు తెచ్చుకోవాలని అనుకున్నారు. అయితే.. మాస్ సినిమాలు మాత్రం నాగ చైతన్యకు అంతగా అచ్చిరాలేదనే చెప్పాలి. అయితే.. కొన్ని చిన్న చిన్న కారణాలతోనే నాగ చైతన్య మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను వదిలేసుకున్నారట.

5 naga chaitanya

నేచురల్ స్టార్ నాని నటించిన “భలే భలే మగాడివోయ్” సినిమా ఆఫర్ తొలుత నాగ చైతన్యను వరించింది. కానీ, మతిమరుపు ఉన్న అబ్బాయిగా నటిస్తే ఇమేజ్ డామేజ్ అవుతుంది అనుకున్న చైతు ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. అలాగే “కొత్తబంగారు లోకం” సినిమా కథని కూడా మొదట చైతూకి చెప్పారట. కానీ, కాలేజీ కుర్రాడి గెటప్ సూట్ అవ్వదు అని భావించిన చైతు ఈ సినిమా రిజెక్ట్ చేశారట. ఇక సమంత, నితిన్ నటించిన “అ ఆ” సినిమా ఆఫర్ కూడా ఫస్ట్ చైతూ కె వచ్చిందట. కానీ.. ఇతర సినిమా కాల్ షీట్స్ లో బిజీగా ఉన్న చైతూ ఈ సినిమాలను రిజెక్ట్ చేశారట.


End of Article

You may also like