14 ఏళ్లు… 6 మరణాలు… ఎందుకు ఇలా చేసింది..? ఈ డాక్యుమెంటరీ చూశారా..?

14 ఏళ్లు… 6 మరణాలు… ఎందుకు ఇలా చేసింది..? ఈ డాక్యుమెంటరీ చూశారా..?

by Mohana Priya

సినిమాల్లో చాలా జోనర్లు ఉంటాయి. థియేటర్లలో కొన్ని జోనర్ల సినిమాలకి మాత్రమే ఆదరణ ఎక్కువగా లభిస్తుంది. ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులు వాటిని చూస్తున్నారు. డాక్యుమెంటరీ అనే జోనర్ మాత్రం ఒక సెన్సిటివ్ అంశం.

Video Advertisement

ఇందులో ఒక వ్యక్తి గురించి కానీ, ఏదైనా ఒక సంఘటన గురించి కానీ చూపిస్తారు. అలా ఇటీవల విడుదల అయిన ఒక డాక్యుమెంటరీ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అదే నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలైన కర్రీ అండ్‌ సైనేడ్‌: ది జాలీ జోసఫ్‌ కేస్‌.

recent documentary which got huge response

ఈ డాక్యుమెంటరీ కథ విషయానికి వస్తే, జాలీ జోసెఫ్ అనే ఒక వ్యక్తి కేరళలోని కోజికోడ్ లోని కుడతాయి గ్రామానికి చెందినవారు. జాలీ జోసెఫ్ కి, రాయ్ థామస్ అనే ఒక వ్యక్తితో పరిచయం అయ్యింది. తర్వాత వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. జాలీ జోసఫ్ అత్తింట్లో అడుగు పెట్టారు. జాలీ జోసెఫ్ మామయ్య టామ్ థామస్, అత్తయ్య అన్నమ్మ థామస్ టీచర్లుగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. వీళ్ళ కుటుంబంలో ఉన్న మిగిలిన అందరూ కూడా ఉద్యోగాల్లో ఉంటారు.

recent documentary which got huge response

దాంతో జాలీ జోసెఫ్ ని కూడా ఉద్యోగం చేయమని అత్తయ్య అన్నమ్మ థామస్ చెబుతుంది. అత్తయ్య మరి ఎక్కువగా చెప్పడంతో జాలీ కోజికోడ్ లో ఉన్న ఎన్ఐటిలో పనిచేస్తున్నట్టు చెబుతుంది. ప్రతిరోజు కారులో ఉద్యోగానికి వెళ్లి వస్తూ ఉండేది. జాలీకి భర్త ఆస్తి మీద కన్ను పడింది. ఎలాగైనా ఆస్తిని సొంతం చేసుకోవాలి అనే ఆలోచనలో 2002లో  తాగే నీళ్లలో సైనైడ్ కలిపి అత్తయ్య అన్నమ్మ థామస్ ని చంపేసింది. ఆ తర్వాత 2008 లో మామయ్య టామ్ థామస్ తినే ఆహారంలో సైనైడ్ పెట్టి ఆయనని కూడా చంపేసింది.

recent documentary which got huge response

2010 లో భర్తని, ఆ తర్వాత అన్నమ్మ థామస్ సోదరుడు మ్యాథ్యూని కూడా చంపేసింది. అయితే, అన్నమ్మ సోదరుడు మాథ్యూకి ఏదో జరుగుతోంది అని అనుమానం వచ్చింది. అతను మొత్తం విషయాన్ని తెలుసుకునేలోపు 2014 లో విస్కీలో విషయం కలిపి ఆయనని చంపేసింది. 2016 లో తన భర్త దగ్గర బంధువు అయిన షాజు జచారయ్య భార్య, వారి ఏడాదిన్నర బిడ్డని కూడా చంపేసింది. దాంతో జాలీ షాజు జచారయ్యని రెండవ పెళ్లి చేసుకుంది.

recent documentary which got huge response

అయితే రాయ్ థామస్ సోదరుడు రోజో ఇదంతా తెలుసుకొని, తన అన్నయ్య తన ప్రాణం తనే తీసుకునే అంత పిరికివాడు కాదు అని, ఇక్కడ ఏదో జరుగుతోంది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అప్పుడు అసలు విషయాలు అన్నీ బయటికి వచ్చాయి. ఈ కథ మీద అంతకుముందు కూడా చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి. మలయాళంలో కుడతాయి పేరుతో ఒక సీరియల్ రాగా, ఇదే కథ మీద ఒక పాడ్ కాస్ట్ కూడా విడుదల చేశారు.

recent documentary which got huge response

అంతే కాకుండా హిందీలో క్రైమ్ పెట్రోల్ సతర్క్ లో కూడా ఈ కథ గురించి చూపించారు. సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలో నటించిన దహాడ్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా ఈ కథకి సంబంధించిన ఒక విషయాన్ని చూపించారు. ఇప్పుడు ఈ కథ మీద ఒక డాక్యుమెంటరీ వచ్చింది. దీనికి షాలిని ఉషాదేవి రచయితగా చేశారు. అంతా బాగానే ఉన్నా కూడా కొన్ని ప్రదేశాలని చూపించలేదు. దాంతో సహజత్వం కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. అయితే జాలీకి ఒక కొడుకు ఉన్నారు. అతను జాలీ పెద్ద కొడుకు.

recent documentary which got huge response

ఆయనని కూడా ఇందులో చూపించారు. అతను జాలీని తల్లిగా సంబోధించడానికి కూడా ఇష్టపడట్లేదు అని తెలుస్తోంది. సిరీస్ లో అతను మాట్లాడుతున్నంత సేపు ఆ మహిళ అని, లేకపోతే జాలీ అని సంబోధిస్తూ మాట్లాడారు. డిసెంబర్ 22 న విడుదల అయిన ఈ డాక్యుమెంటరీ, మలయాళంతో పాటు, తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. దీనిపై ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా వారి రివ్యూని కూడా తెలుపుతున్నారు.

ALSO READ : సలార్ సినిమా మీద ఈ నెటిజన్ కామెంట్ చూశారా..? ఏం అన్నారంటే..?


You may also like

Leave a Comment