మొత్తానికి ఒక ఇంటివాడైన కోలీవుడ్ కమెడియన్..రేడిన్ కింగ్స్ లే.!

మొత్తానికి ఒక ఇంటివాడైన కోలీవుడ్ కమెడియన్..రేడిన్ కింగ్స్ లే.!

by Mounika Singaluri

డబ్బింగ్ సినిమాల పుణ్యమా అని.. కోలీవుడ్ ,బాలీవుడ్ యాక్టర్లు కూడా మనకు బాగా పరిచేస్తులుగా మారారు. అలా తన కామెడీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కోలీవుడ్ ప్రముఖ కమెడియన్స్ లో రేడిన్ కింగ్స్ లే కూడా ఒకరు. అమాయకపు యాక్షన్ తో సూపర్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా అలరిస్తాడు రేడిన్ కింగ్స్. తెలుగులో కూడా రెండు మూడు సినిమాలలో నటించి బాగా క్రైస్ట్ తెచ్చుకున్నాడు ఈ యాక్టర్.

Video Advertisement

శివ కార్తికేయ నటించిన డాక్టర్ మూవీ తో రేడిన్ కింగ్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో అతని యాక్షన్ కి ఉత్తమ హాస్య నటుడిగా సైమా అవార్డును కూడా అందుకున్నాడు. ఆ తర్వాత విజయ్ బీస్ట్, రజనీకాంత్ జైలర్ లాంటి చిత్రాలలో నటించి మరింత పాపులర్ అయ్యాడు. ఈ మూవీలో తెలుగులో కూడా మంచి ఆదరణ అందుకోవడంతో ఇతను ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇతనికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

46 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఈ హాస్యనటుడు.. ఈ వయసులో ప్రేమించి పెళ్లి చేసుకోవడం అందరిని షాక్ కి గురిచేస్తుంది. ఒక సినిమా షూటింగ్ సమయంలో సంగీత రేడిన్ కింగ్స్ లే.. కలిసి పని చేశారు .ఆ క్రమంలో వారి మధ్య ఏర్పడిన స్నేహం..తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చింది.రేడిన్ కింగ్స్ లే మొదట్లో ఎన్నో సినిమాల్లో చేసిన పెద్ద గుర్తింపు రాలేదు.. అవకాశాలు కూడా రాకపోవడంతో బెంగుళూరులో పలు రకాల షోస్ చేస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఒకసారి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో అతనికి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది.

తరువాత నెల్సన్ డైరెక్షన్లో వచ్చిన వేదాటిమన్నన్ మూవీలో నటించాడు.. కానీ షూటింగ్ మధ్యలో ఆగిపోయింది.అయితే కొంతకాలానికి నయనతార,నెల్సన్ దిలీప్ కాంబోలో వచ్చిన కోలమాకు కోకిల లో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ మూవీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి క్రేజీ కమీడియన్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు.


You may also like

Leave a Comment