ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. రీమాసేన్ లేటెస్ట్ పిక్ చూసి షాకవుతున్న నెటిజన్స్.!

ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. రీమాసేన్ లేటెస్ట్ పిక్ చూసి షాకవుతున్న నెటిజన్స్.!

by Mounika Singaluri

ఉదయ్ కిరణ్ సరసన మనసంతా నువ్వే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది రీమా సేన్. 2001 లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి ఇప్పటికీ ఎందరో మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలో కధ, పాటలు, హీరో, హీరోయిన్ యాక్టింగ్, ఉదయ్ కిరణ్ అలాగే రీమాసేన్ లను ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేరు.

Video Advertisement

ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉండిపోయే ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా అందరి మనసులోని చిరకాలం ఉండిపోతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ అయిన రీమాసేన్ 2001లో తమిళ్ లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా తీసి తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు భాషలే కాకుండా కన్నడ, బెంగాలీలలో కూడా పలు చిత్రాలు తీసి తన నటనతో అందర్నీ మెప్పించుకుంటూ వచ్చింది రీమా సేన్.

అయితే రీమాసేన్ ఎందుకో సినిమాలకు దూరం అవుతూ వచ్చింది. తెలుగు సినిమాలే కాకుండా మరే పరిశ్రమలో కూడా ఏ సినిమాలు తీయకుండా పూర్తిగా సినిమాలకే దూరమైపోయిన రీమాసేన్. ఈమధ్య ఇంస్టాగ్రామ్ లో కూడా అసలు యాక్టివ్ గా ఉండట్లేదు. ఏదో అమావాస్య పౌర్ణమికోసారి ఒక ఫోటో పెడుతూ వస్తుంది. అలాగే తన అకౌంట్ లో తన కుటుంబంతో కలిపి ఒక ఫోటో పెట్టింది రీమా సేన్.

2012లో శివకరణ్ సింగ్ అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న రీమాసేన్ 2013లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. రుద్రవీర్ అని తనకి నామకరణం చేసింది. 1981 అక్టోబర్ లో పుట్టిన ఈ భామ తన కుటుంబంతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో పెట్టింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మనసంతా నువ్వేలో హీరోయిన్ గా ఉన్న రీమా సేన్ కి ఇప్పుడు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? అని నెటిజన్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు.


You may also like

Leave a Comment