మెగాస్టార్ చిరంజీవికి, కమెడియన్ సుధాకర్ కి మధ్య ఉన్న ఈ రిలేషన్ గురించి తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవికి, కమెడియన్ సుధాకర్ కి మధ్య ఉన్న ఈ రిలేషన్ గురించి తెలుసా..?

by Mounika Singaluri

Ads

నటుడు సుధాకర్ అందరికీ సుపరిచితమే. ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. ఇప్పటికి 600 సినిమాలకు పైగా నటించి బాగా పాపులర్ అయ్యాడు. తాను చేసిన కొన్ని పాత్రలు అయితే ఎప్పటికీ గుర్తుంది పోతాయి. ఈయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు నవ్వులు మొహంపై కనిపించేవి. 90ల్లో దాదాపు ప్రతి సినిమాలో ఈ నటుడు ఉన్నాడంటే ఎంత గొప్ప విషయమో కదా.. అయితే అంత గొప్ప నటుడు ఎందుకు గత 20 ఏళ్లుగా స్క్రీన్ మీద కనిపించడం లేదు?

Video Advertisement

సుధాకర్ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం అనారోగ్య సమస్యలే అని అంటున్నా అసలు నిజం ఏమిటి అనేది బయటకి రావడం లేదు. ఇప్పుడు ఈ నటుడు మళ్ళీ నటించాలని, తెర మీద కనపడాలని అనుకుంటున్నా అవకాశాలు మాత్రం లేవు.

megastar

తమిళనాట మరో చిరంజీవి అవ్వాల్సిన సుధాకర్ కేవలం టాలీవుడ్ లో కమెడియన్ గా మిగిలిపోయారు. ఈయన లైఫ్ లో ఓ సినిమా స్టోరీ అంత ఫ్లాష్ బ్యాక్ ఉంది. 1977 సంవత్సరంలో సుధాకర్, చిరంజీవి ఒకేసారి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఒకేసారి డిగ్రీ కూడా తీసుకుని బయటకి రావడం జరిగింది. ఇది ఇలా ఉంటే యాక్టింగ్ స్కూల్ మధ్యలో ఉన్నప్పుడే తమిళం నుంచి సుధాకర్ కు ఆఫర్స్ కూడా రావడం మొదలయ్యాయి. దాంతో అక్కడికి వెళ్ళిపోయాడు ఈయన.

అక్కడి సినీ ఇండస్ట్రీలో పాలిటిక్స్ కారణంగా సుధాకర్ కెరీర్ వెనక్కి తగ్గింది. దీనితో తెలుగునాట మళ్ళీ వచ్చి కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచే సుధాకర్ కు, మెగాస్టార్ చిరంజీవికి మంచి రిలేషన్ ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. వీరితో పాటు హరిబాబు అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా వీరితో పాటే అవకాశాలకు ప్రయత్నించారు. వీరు ముగ్గురు కలిసి ఒక రూమ్ లో ఉంటూ వంట చేసుకునేవారు. ఉదయాన్నే స్టూడియోల చుట్టూ తిరగడం, అవకాశాల కోసం ప్రయత్నించడం వీరి దినచర్యగా మారింది. హరిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సెటిల్ అయ్యారు. చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. సుధాకర్ తమిళనాట స్టార్ హీరో అయినప్పటికీ .. తెలుగు నాట కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు.


End of Article

You may also like