Ads
ఈ సంవత్సరం తెలుగు హీరోలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నితిన్ ముందుగా అనుకున్నట్టు ఏప్రిల్ 14 న వివాహం చేసుకోవాలి కాని కరోనా కారణంగా ఆ వివాహం వాయిదా పడింది.దానితో తాజాగా బుధవారం యంగ్ హీరో నితిన్ మరియు షాలిని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇక ఈ జంట ఈ నెల 26 న పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
Video Advertisement
కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ను అనుసరించి బంధువుల సమక్షంలో ఈ జంట ఒక్క టవ్వనున్నారు.బుధవారం జరిగిన వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉండగా…నితిన్ కి కాబోయే భార్య గురించి తెలుసుకోడానికి నెటిజెన్లు ఎంతో సెర్చ్ చేస్తున్నారు. మరి షాలిని గురించి తెలుసుకుందాము రండి. ‘ఇష్క్’ (2012) సినిమా జరుగుతున్న సమయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా నితిన్ షాలిని కలుసుకున్నారు. చూడగానే నా మనసుకు తను బాగా నచ్చింది. ముందు ఫ్రెండ్స్‌లానే ఉన్నాం. కొంత సమయం తరవాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాక నెక్ట్స్ స్టెప్ తీసుకున్నాం. గత ఏడాది ఇంట్లోవాళ్లకు చెప్పాం. ఇంట్లోవారికి చెప్పగానే రెండు కుటుంబాలవారు ఎటువంటి అభ్యంతరం లేకుండా అంగీకరించారు అంటూ ఓ ఇంటర్వ్యూలో నితిన్ తెలిపారు.
ఇక షాలిని గారి విషయానికి వస్తే….ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కందుకూరులో 1989 సెప్టెంబర్ 27న షాలిని జన్మించారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్లు. షాలిని చిన్నతనంలోనే కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది. సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో చదివి తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం లండన్ వెళ్లిపోయారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక ఎమ్.ఎన్.సి లో హెచ్‌ఆర్ గా చేస్తున్నారు.
నితిన్ షాలిని నాలుగు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని నితిన్ చాలా సీక్రెట్‌గా ఉంచారు.మొదట నితిన్ కి పెళ్లి కుదిరింది అని వార్త రాగానే అందరు పెద్దలు కుదిరిచ్చిన పెళ్లి అనుకున్నారు. ఆయనే స్వయంగా లవ్ మ్యారేజ్ అని చెప్పేసరికి అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఇక అసలు విషయానికి వస్తే…షాలిని తల్లితండ్రులు డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ షేక్ నూర్జహాన్ నాగర్ కర్నూలులో గత 20 ఏళ్లుగా ప్రగతి నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నారు. వారిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. డాక్టర్ నూర్జహాన్‌కు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది.2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి అందరికి తెలిసిందే. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం సీటును నూర్జహాన్‌కు ఇచ్చారు చిరంజీవి. కానీ ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఆ పార్టీనే లేదు. నూర్జహాన్ కూడా రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు కూతురు పెళ్లితో ఆమె మళ్ళి వార్తల్లోకెక్కారు.
Also check: హీరో నితిన్ మరియు షాలిని ఎంగేజ్‌మెంట్ ఫొటోస్
End of Article