“ఏ మాయ చేసావే” తో పాటు… “సమంత” నటించిన 7 రీమేక్ సినిమాలు..!

“ఏ మాయ చేసావే” తో పాటు… “సమంత” నటించిన 7 రీమేక్ సినిమాలు..!

by kavitha

Ads

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తన నటనతో అందరిని ఆకట్టుకుంది. కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఏమాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సమంతకు ఆ మూవీ తరువాత ఆఫర్స్ క్యూ కట్టాయి. వచ్చిన అవకాశాలతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.

Video Advertisement

ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో, వెబ్ సిరీస్ లతో చాలా బిజీగా ఉన్నారు. అలాగే శాకుంతలం మూవీ ప్రమోషన్స్ కూడా పాల్గొంటున్నారు. సమంత ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇది హాలీవుడ్ లో వచ్చిన ‘సిటాడెల్’ కి రీమేక్ గా వస్తోంది. రీమేక్ లో నటించడం సమంతకు ఇది మొదటిసారి కాదు. ఆమె కెరీర్ లో చాలా రీమేక్ చిత్రాలలో నటించింది. అందులో కొన్ని విజయం సాధించగా, కొన్ని నిరాశపరచాయి. అయితే సమంత నటించిన రీమేక్ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
samantha-remake-movies1.ఏ మాయ చేసావే:
నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమాతోనే సమంత హీరోయిన్‏గా పరిచయమైంది. 2010లో వచ్చిన ఈ మూవీకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కింది. కోలీవుడ్ లో శింబు, త్రిష జంటగా నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
2. ఏటో వెళ్ళిపోయింది మనసు:
నాని, సమంత జంటగా నటించిన ఈ సినిమాను గౌతం మీనన్ తెరకెక్కించారు. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీ 2012 లో రిలీజ్ అయ్యింది. ఇక తెలుగు, తమిళంలో హీరోలు వేరు. కాని హీరోయిన్ గా సమంత నటించింది. ఈ మూవీ తెలుగులో ప్లాప్ గా నిలిచింది.
3. బెంగళూరు నాట్కల్:
ఈ తమిళ చిత్రం ‘బెంగుళూర్ డేస్’ అనే మలయాళ మూవీ రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీలో సమంతతో పాటుగా రానా దగ్గుబాటి, ఆర్య, బాబీ సింహా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచింది.
4. యూటర్న్:
పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. సమంత, ఆది పినిశెట్టి, భూమిక చావ్లా నటించారు. ఈ మూవీ 2018 లో రిలీజ్ అయ్యింది. తమిళం, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడినది. ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.5. ఓ బేబీ:
2019లో రిలీజ్ అయిన ఈ మూవీ 2014 లో రిలీజ్ అయిన కొరియన్‌ చిత్రం ‘మిస్‌గ్రానీ’ కి  రీమేక్‌ గా వచ్చింది. ఈ సినిమాలో సమంతతో పాటుగా నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌, లక్ష్మీ, రావూ రమేష్‌, తేజ సజ్జా నటించారు. ఈ మూవీ విజయం సాధించింది.6. జాను:
ఈ  ప్రేమ కథా చిత్రం కోలీవుడ్ లో వచ్చిన ’96’ మూవీకి రీమేక్. 96 మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్  తెలుగులో కూడా దర్శకత్వం చేశారు. ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటించారు. ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది.
7. సిటాడెల్: 
బాలీవుడ్ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ లో తెరకెక్కిన ‘సిటాడెల్’ కి రీమేక్ గా వస్తోంది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన పాత్రలో బాలీవుడ్ లో సమంత నటిస్తోంది.
Also Read: ఇటీవల విడుదల అయ్యి “సూపర్ హిట్” అయిన ఈ తమిళ సినిమా కథ ఏంటి..? ఎందుకు దీనికి అంత క్రేజ్ వచ్చింది..?


End of Article

You may also like