ఏ ఇండస్ట్రీలో అయినా సరే రీమేక్ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. మన సినిమాలని వేరే భాషల్లో రీమేక్ చేస్తున్నారు. వేరే ఇండస్ట్రీ సినిమాలని కూడా తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. అయితే చాలా వరకు సినిమాలు తమ భాషలతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. కొన్ని మాత్రం అవ్వట్లేదు. అలాంటి సినిమాలని రీమేక్ చేస్తున్నారు.

Video Advertisement

అయితే ఇంకొక విషయం ఏమిటంటే ఏ భాషలో నుండి అయితే రీమేక్ చేశారో అదే భాషలో ఆ సినిమాలు విడుదల అవుతున్నాయి. లేదా ఒక సినిమాని డబ్ చేసి విడుదల చేసిన తర్వాత, ఆ సినిమాని రీమేక్ చేయడం కూడా జరుగుతోంది. అలా రీమేక్ చేసిన భాషలోనే విడుదల అయిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 నాగవల్లి – రాజా విజయ రాజేంద్ర బహద్దూర్

కన్నడలో విష్ణువర్ధన్ నటించిన ఇదే సినిమాని తెలుగులో వెంకటేష్ హీరోగా నాగవల్లి పేరుతో రీమేక్ చేశారు. కానీ మళ్ళీ కన్నడ సినిమాని కూడా తెలుగులో డబ్ చేశారు.

#2 ఏ మాయ చేసావే – ఎందుకిలా చేసావే

ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందింది. కానీ తమిళ్ సినిమా ఎండింగ్ మాత్రం తెలుగు సినిమాతో పోలిస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాను యూట్యూబ్ లో విడుదల చేశారు.

#3 గద్దల కొండ గణేష్ – చిక్కడు దొరకడు

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్ తండా సినిమా రీమేక్. ఈ సినిమాని తెలుగులో చిక్కడు దొరకడు పేరుతో డబ్ చేశారు.

#4 ఖైదీ నెంబర్ 150 – కత్తి

తమిళ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో డబ్ చేశారు. పాటలు కూడా విడుదల చేశారు. కానీ తరువాత ఇదే సినిమాని తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో ఈ సినిమా తెలుగులో పెద్దగా క్రేజ్ సంపాదించలేదు.

#5 నరసింహ నాయుడు – సింహబలుడు

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా నరసింహ నాయుడుని తమిళంలో సింహబలుడు పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేశారు. ఇందులో అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా టీవీ లోకూడా చాలా సార్లు టెలికాస్ట్ అయ్యింది.

#6 గాడ్ ఫాదర్ – లూసిఫర్

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా లూసిఫర్ సినిమాని తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. అయితే ఇదే సినిమాని మళ్లీ మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రీమేక్ గా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా కూడా మలయాళంలో అదే పేరుతో విడుదల అవుతోంది.

#7 కాటమరాయుడు – వీరుడొక్కడే

తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన వీరం సినిమాని తెలుగులో వీరుడొక్కడే పేరుతో డబ్ చేశారు. ఇదే సినిమాని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశారు.

#8 గురు – గురు బ్రహ్మ

వెంకటేష్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన సినిమా గురు. ఈ సినిమాని తమిళంలో మాధవన్ తో చేశారు. అదే సినిమాని తెలుగులో గురు బ్రహ్మ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు.

#9 టెంపర్ – అయోగ్య

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమాని తమిళంలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రీమేక్ చేశారు. తమిళ్ ఎండింగ్ మార్చారు. ఇదే సినిమాని తెలుగులో ఇదే పేరుతో డబ్ చేసి విడుదల చేశారు.

#10  కృష్ణ – రజిని ఫ్రం రాజమండ్రి

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాని కన్నడలో ఉపేంద్ర హీరోగా రీమేక్ చేశారు. ఈ సినిమాని తెలుగులో రజిని ఫ్రం రాజమండ్రి పేరుతో విడుదల చేశారు.

#11 మన్మధుడు – కంత్రి మొగుడు

నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమాని కన్నడలో ఉపేంద్ర రీమేక్ చేశారు. ఈ సినిమా సగం మన్మధుడు సినిమా, సగం గజిని సినిమా కలిపి ఉంటుంది. ఈ సినిమాని తెలుగులో కంత్రి మొగుడు పేరుతో డబ్ చేశారు.

#12 గబ్బర్ సింగ్ – తిమ్మిరి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా దబాంగ్ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాని తమిళంలో శింబు హీరోగా చేసి విడుదల చేశారు. దీన్ని తెలుగులో తిమ్మిరి పేరుతో డబ్ చేసి విడుదల చేశారు.

ఇవి మాత్రమే కాకుండా నువ్వు నాకు నచ్చావ్ సినిమాని నువ్వు నాకు ఇష్టం పేరుతో, ఆనందో బ్రహ్మ సినిమాని పెట్రోమాక్స్ పేరుతో ఇంకా చాలా సినిమాలని రీమేక్ చేసి మళ్లీ ఒరిజినల్ భాషలోనే విడుదల చేశారు.