Ads
టాలీవుడ్ అంటేనే రీమేక్స్ అడ్డా. వేరే ఇండస్ట్రీస్‌లో సూపర్ హిట్టైన సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తుంటారు. ప్రస్తుతం చిరు మాలీవుడ్ బ్లాక్ బస్టర్ లూసీఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నాడు. అలాగే వేదాళం చిత్రాన్ని భోళాశంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు.అయితే చిరు చేసే సినిమాలు వరుసగా రీమేక్ సినిమాలే కావడం ఈయనకు మైనస్ అవుతుంది.
Video Advertisement
నిజానికి లూసిఫర్ సినిమా డబ్బింగ్ చిత్రంగా మన తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.కానీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు.అయితే ఎప్పుడైతే మెగాస్టార్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారో అప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఓటిటిలో ఈ సినిమాను చూడడం మొదలు పెట్టారు.ఒక్కొక్కరు రెండు మూడు సార్లు చూసిన వారు కూడా ఉన్నారు.
దీంతో ఇప్పుడు మెగాస్టార్ తీసే గాడ్ ఫాదర్ సినిమాకు ఎక్కువ హోప్స్ లేవు. ఎలాగైనా మెగాస్టార్ సినిమా కాబట్టి ఓపెనింగ్స్ అయితే భారీగానే వస్తాయి కానీ ఈ సినిమా డైరెక్ట్ సినిమా కాకపోవడం. అందులోను కథ రివీల్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమాపై అన్ని అంచనాలు పెట్టుకోలేదు.గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ వల్ల, మెగాస్టార్ లుక్ వల్ల సినిమాపై అంచనాలు అయితే ఏర్పడ్డాయి కానీ సినిమాకు రావాల్సిన స్పందన మాత్రం రాలేదు అనే టాక్ నడుస్తుంది.
గతం లో పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమ రాయుడు’ చిత్రం కూడా ఈ పరిస్థితులనే ఎదుర్కొంది. మెగాస్టార్ చేస్తున్న సినిమాకే ఇలా ఉంటే ఇక మాములు హీరోలు రీమేక్ సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం.మరి దీనంతటికి కారణం ఓటిటిలు రావడమే అంటున్నారు.
ఓటీటీ లు రావడంతో పరిస్థితి ఇలా మారింది. ప్రేక్షకులు ఈ మాధ్యమాలు వచ్చినప్పటి నుంచి భాషతో సంబంధం లేకుండా దేశవిదేశాల చిత్రాలు కూడా చూస్తున్నారు ప్రేక్షకులు. ఇలా అయితే రాను రాను రీమేక్స్‌లో నటించడం మన హీరోలకు పెద్ద రిస్క్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
End of Article