చైల్డ్ ఆర్డిస్ట్ కావ్య గుర్తుందా ? అదేనండి గంగోత్రి సినిమాలో చిన్నప్పటి అదితి అగర్వాల్ గానటించిన చైల్డ్ ఆర్టిస్ట్ . వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా పాటలో ఆడిపాడిన చిన్నారి . గంగోత్రి సినిమాలో తన కళ్లతో,నవ్వుతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గంగోత్రి సినిమా వచ్చి పదిహేనేళ్లకు పైనే అయింది . ఆ చిన్నపిల్లలు ఇఫ్పుడు పెద్దవాళ్లైపోయుంటారు .

కావ్య ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుంది ? గంగోత్రి తర్వాత సినిమాలెందుకు చేయలేదు? ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తందా? ఇన్ని క్వశ్చన్స్ మీ మైండ్లో రన్ అవుతున్నాయా వాటన్నింటికి సమాధానాలివిగో.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎందరో చైల్డ్ ఆర్టిస్టులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . తరుణ్ , షాలిని, షామిలి , బాలాదిత్యా, రాశి వీళ్లంతా చిన్నప్పటి నుండి నటనలో ఉన్నవాళ్లే . అంతెందుకు కమల్ హాసన్ కూడా బాల్యనటుడిగా చేసారు తెలుసా ? కొందరు చైల్డ్ ఆర్టిస్టులు సినిమాలు కంటిన్యు చేస్తూ నటులుగా ఇక్కడే స్థిరపడితే, మరికొందరు ఒకటి రెండు సినిమాలతో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెక్ పెట్టి స్టడీస్ కంటిన్యూ చేసారు. కావ్య రెండో కోవకి చెందిన అమ్మాయి.

గంగోత్రి తర్వాత అరకొర చిత్రాల్లో చేసినప్పటికి గంగోత్రి అంత పేరు తీసుకురాలేదు. అయినా కూడా ఆఫర్స్ వస్తూనే ఉన్నా కావ్య  ఇండస్ట్రీకు దూరంగా ఉంది. చదువు కోసం యాక్టింగ్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. పూణెలో బిఎ ఎల్ఎల్ బి కంప్లీట్ చేసింది. ఒకవైపు  చదువుకుంటూనే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. ఇప్పటికే పలు నాట్యప్రదర్శనలు  కూడా ఇచ్చింది. రీసెంట్ గా పూణే నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయింది కావ్య.

ఇండస్ట్రీలోకి ఒకసారి అడుగుపెట్టాక వెనక్కి వెళ్లాలని ఉన్నా మళ్లీ మనసు ఇండస్ట్రీవైపే లాగుతుంది. ఈ రంగుల ప్రపంచం అలాంటిది. ఇన్ని రోజులు ఇండస్ట్రీకు దూరంగా ఉన్న కావ్య పరిస్థితి ఇఫ్పుడు అదే . చదువు అయిపోయింది. మళ్లీ నటనవైపు రావాలనుకుంటుంది. సో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా సిస్టర్ రోల్స్.. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న ఏ రోల్ అయిన సరే చేసేందుకు సిద్దం అంటుంది.

అందులో భాగంగానే రీసెంట్ గా ఒక ఫొటో షూట్ చేయించుకుంది . అందులో కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది . కావ్య లేటేస్ట్ ఫొటోస్‍లో చాలా అందంగా కనిపిస్తోంది.  సోషల్ మీడియాలో వైరలవుతున్న కావ్య ఫొటోస్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మళ్లీ సినిమాల్లోకి రమ్మని కొందరు కామెంట్ కూడా చేశారు . మరింకేం లెట్స్ వెల్కం టు వల్లంకి పిట్టా .. ఓహ్ కావ్యా..

Follow Us on FB:


Sharing is Caring: