“వెయ్యినొక్క జిల్లాల వరకు” లాగానే… తెలుగులో “రీమిక్స్” అయిన 19 పాత సూపర్ హిట్ పాటలు..!

“వెయ్యినొక్క జిల్లాల వరకు” లాగానే… తెలుగులో “రీమిక్స్” అయిన 19 పాత సూపర్ హిట్ పాటలు..!

by Anudeep

Ads

సినిమా విజయం లో నటీనటులు, హీరో, కథ ఎంత పాత్ర పోషిస్తాయో పాటలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయి. ఒక ఆల్బమ్ హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే అని నమ్ముతారు చాలా మంది. అందుకే మంచి పాటలు, సంగీతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. అయితే కొన్ని సార్లు మన తెలుగులో సూపర్ హిట్ అయిన పాటలనే రీమేక్ చేసారు కొందరు హీరోలు. ఆ రీమేక్ సాంగ్స్ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఆ పాటలేవో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

#1 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..

అప్పట్లో ట్రెండ్ సెట్టర్ అయిన ‘మిస్సమ్మ’ చిత్రం లోనిది ఈ సాంగ్.. ఇందులో సీనియర్ ఎన్టీఆర్, సావిత్రి నటించారు. తర్వాత ‘ఖుషి’ చిత్రం లో పవన్, భూమిక ఈ సాంగ్ ని రీమేక్ చేయగా సూపర్ హిట్ అయ్యింది.

#2 సోగ్గాడే చిన్ని నాయన..

ఓల్డ్ మూవీ ‘ఆస్తిపరులు’ చిత్రం లోది ఈ పాట.. దీనికి కొన్ని మార్పులు చేసి నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన ‘ చిత్రం లో రీమేక్ చేసారు.

#3 నిన్ను రోడ్ మీద చూసినది..

నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ చిత్రం లోని నిన్ను రోడ్ మీద చూసినది.. సాంగ్ ని ‘సవ్యసాచి’ చిత్రం లో నాగ చైతన్య రీమేక్ చేసారు.

#4 బంగారు కోడి పెట్ట..

చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’ చిత్రం లో సూపర్ హిట్ అయిన బంగారు కోడి పెట్ట సాంగ్ ని, రామ్ చరణ్ ‘మగధీర’ చిత్రం లో రీమేక్ చేయగా సూపర్ హిట్ అయ్యింది.

#5 వాన వాన వెల్లువాయే..

చిరు సూపర్ హిట్ చిత్రమైన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం లో సాంగ్ వానా వానా వెల్లువాయే ని రామ్ చరణ్, తమన్నా ‘రచ్చ’ సినిమాలో రీమేక్ చేసారు.

#6 గువ్వా గోరింకా తో..

ఖైదీ నెంబర్ 786 చిత్రం లో సూపర్ హిట్ అయిన ‘గువ్వా గోరింకా తో..’ సాంగ్ ని సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రం లో రీమేక్ చేసారు.

#7 అందం హిందోళం..

చిరంజీవి నటించిన ‘యముడికి మొగుడు’ చిత్రం లో హిట్ అయిన సాంగ్ అందం హిందోళం పాటని సాయి ధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ మూవీ లో రీమేక్ చేసారు.

#8 చమకు చమకు చామ్..

మెగాస్టార్ నటించిన ‘కొండవీటి దొంగ’ చిత్రం లోని చమకు చమకు చామ్.. సాంగ్ ని సాయి ధరమ్ తేజ్ ‘ఇంటెలిజెంట్’ చిత్రం లో రీమేక్ చేసారు.

#9 శుభలేఖ రాసుకున్నా..

కొండవీటి దొంగ లోని మరో సూపర్ హిట్ సాంగ్ శుభ లేఖ రాసుకున్నా పాటని రామ్ చరణ్ ‘నాయక్’ చిత్రం లో రీమేక్ చేసారు.

#10 అరె ఓ సాంబ..

బాల కృష్ణ నటించిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’ చిత్రం లోని అరె ఓ సాంబ సాంగ్ ని కళ్యాణ్ రామ్ ‘పటాస్’ చిత్రం లో రీమేక్ చేసారు.

#11 ఒక లైలా కోసం..

అక్కినేని నాగేశ్వర రావు నటించిన ‘రాముడు కాదు కృష్ణుడు’ చిత్రం లోని ఒక లైలా కోసం పాటని.. నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ చిత్రం లో రీమేక్ చేసారు.

https://www.youtube.com/watch?v=Cl8EvH3lTFQ

#12 వెల్లువొచ్చి గోదారమ్మ..

శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన ‘దేవత’ చిత్రం లో సూపర్ హిట్ సాంగ్ వెల్లువొచ్చి గోదారమ్మ..ని వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం లో రీమేక్ చేసారు.

#13 వెన్నెలైనా చీకటైనా

సూపర్ స్టార్ కృష్ణ, శ్రీ దేవి జంటగా నటించిన ‘పచ్చని కాపురం’ చిత్రం లోని వెన్నెలైనా చీకటైనా.. సాంగ్ ని ఆయన అల్లుడు సుధీర్ బాబు ‘ప్రేమ కథ చిత్రం’ లో రీమేక్ చేసారు.

#14 స్వాతిలో ముత్యమంత

బాలకృష్ణ నటించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రంలోని స్వాతిలో ముత్యమంత పాటని అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ చిత్రం లో రీమేక్ చేసారు.

#15 ఆకాశంలో ఒక తార

కృష్ణ, జయప్రద కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ ‘సింహాసనం’ చిత్రం లోని ఆకాశంలో ఒక తార పాటని అల్లరి నరేష్ ‘సీమ టపాకాయ్’ చిత్రం లో రీమేక్ చేసారు.

#16 గలగలా పారుతున్న గోదారిలా..

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘గౌరీ’ చిత్రంలోని గలగలా పారుతున్న గోదారిలా సాంగ్ ని ఆయన కుమారుడు మహేష్ బాబు ‘పోకిరి’ చిత్రం లో రీమేక్ చేసారు.

#17 ఆరేసుకోబోయి పారేసుకున్నాను..

సీనియర్ ఎన్టీఆర్, జయప్రద నటించిన ‘అడవి రాముడు’ చిత్రంలోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటని ప్రభాస్, ఆర్తి అగర్వాల్ ‘అడవి రాముడు’ చిత్రం లో రీమేక్ చేసారు.

#18 వెయ్యినొక్క జిల్లాల వరకు

వెంకటేష్ నటించిన సూర్య ఐపిఎస్ సినిమాలోని ఈ పాటని రవితేజ రావణాసుర సినిమా కోసం రీమిక్స్ చేశారు.

#19 ఎన్నో రాత్రులొస్తాయి గానీ..

బాలకృష్ణ నటించిన ‘ధర్మక్షేత్రం’ చిత్రం లోని ఎన్నో రాత్రులొస్తాయి గానీ పాటని కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రం లో రీమేక్ చేసారు.

 


End of Article

You may also like