యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఈ చిత్రాన్ని ‘తానాజీ’ దర్శకుడు  రౌత్ తెరకెక్కిస్తున్నాడు. టి.సిరీస్ ఫిలిమ్స్, రెట్రోఫిల్స్ బ్యానర్ల పై ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Video Advertisement

ఈ సినిమాలో సీతగా కృతిసనన్ నటిస్తుంది. ఈ చిత్రం జూన్ 16న  గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ మూవీలో నటించినందుకు  యాక్టర్స్ తీసుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
1. ప్రభాస్ – 100-150 కోట్లు:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ లో నటించేందుకు చాలా కష్టపడ్డాడు. రెమ్యూనరేషన్ విషయంలో అందరి కన్నా ఎక్కువగా ప్రభాస్ అందుకున్నట్లు సమాచారం. శ్రీరాముడి పాత్రలో నటించేందుకు ప్రభాస్ 100 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకున్నాడు. కచ్చితంగా చెప్పాలంటే రూ. 100 – 150 కోట్లు వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. 2. సైఫ్ అలీ ఖాన్ – 12 కోట్లు:

బాలీవుడ్ స్టార్ హీరో  సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో రావణుడి పాత్రలో నటించారు. ఆదిపురుష్ లో నటించడానికి గాను దాదాపు రూ. 12 కోట్లు పారితోషికం తీసుకున్నాడని తెలుస్తోంది.  బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే విలన్‌లలో ఒకరిగా నిలిచాడు.3. కృతి సనన్ – రూ. 3 కోట్లు:

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కృతి సనన్ ఆదిపురుష్ చిత్రంలో సీతా దేవిగా నటించింది. ఆదిపురుష్‌లో నటించినందుకు గాను కృతి సనన్ దాదాపు రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుందని తెలుస్తోంది.  4. సన్నీ సింగ్ – 1.5 కోట్లు:

బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్‌ తన నటనతో యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆదిపురుష్‌ చిత్రంలో లక్ష్మణుడు పాత్రలో నటించారు. సన్నీఈ పాత్రలో నటించినందుకు గాను దాదాపు రూ.1.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది.
5. సోనాల్ చౌహాన్ – రూ. 50 లక్షలు:

టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఆదిపురుష్ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో నటించినందుకు గాను సోనాల్ దాదాపు రూ. 50 లక్షలు చెల్లించారని సమాచారం.
Also Read: “ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా..?” అంటూ… “బోయపాటి-రామ్ పోతినేని” సినిమా టీజర్‌పై 15 మీమ్స్..!