రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కరలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమె అందరికీ సుపరిచితురాలే. బద్రి సినిమాలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన తర్వాత ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.

Video Advertisement

వీరికి అకిరా, ఆద్యా పుట్టారు. అయితే ఏవో కొన్ని కారణాలవల్ల ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మళ్లీ మూడో పెళ్లి చేసుకోవడం, రేణు దేశాయ్ తన పిల్లలతో విడిగా ఉండడం జరుగుతుంది.

ఇప్పుడు రేణు దేశాయ్ మళ్ళీ 18 విరామం తర్వాత టైగర్ నాగేశ్వరరావు తో రీఎంట్రీ కి సిద్ధమయ్యారు.ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. గతంలో తాను రెండో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించానని తర్వాత దాని గురించి ఎలాంటి సమాచారం లేకపోవడానికి గల కారణాన్ని వివరించారు.


తన కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా తనకు ఓ తోడు ఉండాలని కోరుకున్నారు.అందువల్ల పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవాలని ఉద్దేశంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నానని తెలిపారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. అయితే తనకి నిశ్చితార్థమైన సమయానికి ఆద్యాకి 7 సంవత్సరాలు మాత్రమేనని… ఒకవేళ తాను పెళ్లి చేసుకుంటే అద్యాకి కావలసినంత సమయం ఇవ్వలేననే ఉద్దేశంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలియజేశారు.

తనకి వివాహ బంధం అంటే చాలా గౌరవం ఉందని ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉన్నట్లు తెలియజేశారు. ఆద్యాకి ప్రస్తుతం 13 ఏళ్లని తను కొంచెం పెద్దదయ్యాక రెండో పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు. అకీరా, ఆద్యా ఇద్దరు కూడా చాలా ఉన్నతంగా ఆలోచిస్తారని తెలిపారు. ఎవరైనా నచ్చితే పెళ్లి చేసుకోమని అకీరా ఎప్పుడూ చెబుతూ ఉంటాడని గుర్తు చేసుకున్నారు.తన పిల్లలిద్దరూ భవిష్యత్తులో స్థిరపడిన తర్వాత రెండో పెళ్లి గురించి ఆలోచిస్తానని అన్నారు.

Also Read:వామ్మో నాని ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా…!