చాడీలు చెప్పేవారికి ఇలా బుద్ది చెప్పండి…

చాడీలు చెప్పేవారికి ఇలా బుద్ది చెప్పండి…

by Sunku Sravan

Ads

మన పెద్ద వాళ్ళు ఒక మాట ఎప్పుడూ అంటూ ఉంటారు చెప్పకు రా చెడేవు అని కానీ ఈ పదానికి అర్థం చాలామందికి తెలియదు. చెప్పుడు మాటలు చెప్తే చివరికి నువ్వే చెడిపోతావు అని దీని అర్థం. ఇలాంటి వారిని మన నిజ జీవితంలో మన స్నేహితుల రూపంలో సన్నిహితుల రూపంలో, మన దగ్గర బంధువులను కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చూస్తూనే ఉంటాం. ఈ చెప్పుడు మాటలనేవి ఎందుకు వస్తాయంటే.. ఒక మనిషి విజయాన్ని ఓర్వలేని వారు అంటే ఒక చిన్న మనస్తత్వం గల వారు అలా చేస్తారు.

Video Advertisement

అధమ స్థాయిలో ఉన్నటువంటి వారు ఇలా చెప్పుడు మాటలు చెబుతారు. కానీ వాళ్లు పైకి కనిపించడానికి చాలా గొప్ప తీరు కలిగినటువంటి వారిగా ఉంటారు. ఈర్ష, అసూయ, ద్వేషం వారి మనసులో ఉంటుంది. వాస్తవానికి చెప్పాలంటే ఇటువంటి మనస్తత్వం భార్యాభర్తల మధ్య,తల్లిదండ్రుల పట్ల పిల్లలకుండడం ఒక దురదృష్టకరమైన విషయం. అయితే ఇలాంటి వారిని ఎలా దూరం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. మన గురించి ఎవరైనా చెడుగా చెబితే అది నిజమో కాదో మనమే తెలుసుకోవాలి. వేరే వాళ్ళు చెప్పేది నమ్మకూడదు.

అలా నిర్ధారణ చేసుకున్న తర్వాతే వారిని తప్పు పట్టాలి. అలాంటి సమయంలో మన మీద మనం కాంఫిడెన్స్ ఉంచుకొని నేను సరైన మార్గంలోనే వెళుతున్నాను అని నమ్మకం పెట్టుకోవాలి. ఎదుటి వారు మన గురించి చెడుగా చెబుతున్నప్పుడు మనలో అటువంటి గుణాలు ఉన్నాయా లేదా అని ముందుగా మనమే అనాలసిస్ తెలుసుకోవాలి. ఒకవేళ మనలో అటువంటి గుణాలు లేకపోతే మన మీద మనకు నమ్మకం ఉంటే ఎదుటి వారు మన మీద ఉన్న అసూయ తోనే అలా మన గురించి చెడుగా చెబుతున్నారని అర్థం చేసుకోవాలి లేదా వేరొకరితో అవసరం ఉండడంవల్ల మన గురించి వాళ్ళ దగ్గర చెడుగా చెబుతున్నారని అర్థం చేసుకోవచ్చు.

 


End of Article

You may also like