Ads
మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న చిరు.. రీమేక్ సినిమాలే చేస్తుండటం తో ఆయన ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చిరు నటించిన గాడ్ ఫాదర్ చిత్రం..మలయాళ చిత్రం లూసిఫర్ కి రీమేక్. ఈ చిత్రాన్ని అప్పటికే ఓటీటీలో చాలా మంది చూసేసరికి చిరు సినిమాకి టాక్ బాగున్నా కలెక్షన్స్ రాలేదు.
Video Advertisement
అయితే ఓటీటీ లు రావడంతో పరిస్థితి ఇలా మారింది. ఈ మాధ్యమాలు వచ్చినప్పటి నుంచి భాషతో సంబంధం లేకుండా దేశవిదేశాల చిత్రాలు కూడా చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సంగతి పక్కన పెడితే తన సుదీర్ఘ సినీ కెరీర్ లో చిరు చాలా రీమేక్ చిత్రాలు చేసి హిట్లు కొట్టారు.. ఇప్పుడు చిరు రీమేక్ చేసిన చిత్రాలేవో చూద్దాం..
#1 గాడ్ ఫాదర్
చిరు నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ మలయాళంలో హిట్టైన లూసీఫీర్కు రీమేక్. ఈ చిత్రం లో మోహన్ లాల్ హీరో గా నటించారు.
రిజల్ట్ : యావరేజ్
#2 ఖైదీ నంబర్ 150
మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం కూడా తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.
రిజల్ట్ : సూపర్ హిట్
#3 శంకర్ దాదా M.B.B.S
జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో చేసిన ‘శంకర్ దాదా MBBS’ సినిమా హిందీలో సంజయ్ దత్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మున్నాభాయ్ MBBS’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.
రిజల్ట్ : సూపర్ హిట్
#4 స్నేహం కోసం
చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన సినిమా తమిళ్ సినిమా నాట్పుక్కాగ కి రీమేక్. తమిళంలో కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో శరత్ కుమార్, విజయ్ కుమార్ హీరోలుగా నటించారు.
రిజల్ట్ : ప్లాప్
#5 చట్టానికి కళ్ళు లేవు
చిరంజీవి హీరోగా నటించిన చట్టానికి కళ్ళు లేవు సినిమా సట్టం ఒరు ఇరుత్తరై అనే సినిమా రీమేక్.
రిజల్ట్ : హిట్
#6 విజేత
చిరంజీవి, భాను ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బెంగాలీ సినిమా సాహెబ్ కి రీమేక్.
రిజల్ట్ : సూపర్ హిట్
#7 ఘరానా మొగుడు
చిరంజీవి, నగ్మా నటించిన ఘరానా మొగుడు మూవీ కూడా.. కన్నడలో రాజ్ కుమార్, మాధవి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘అనురాగ అరాలితు’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.
రిజల్ట్ : సూపర్ హిట్
#8 పసివాడి ప్రాణం
పసివాడి ప్రాణం కూడా పూవిను పుతియా పూంతెన్నల్ అనే ఒక మలయాళం సినిమాకి రీమేక్.
రిజల్ట్ : ఇండస్ట్రీ హిట్
#9 పట్నం వచ్చిన పతివ్రతలు
చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించిన పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా పట్టణక్కె బంద పత్నియరు అనే ఒక కన్నడ సినిమా రీమేక్.
రిజల్ట్ : సూపర్ హిట్
#10 ఠాగూర్
చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్ సినిమా కూడా రమణ అనే ఒక తమిళ్ సినిమా రీమేక్.
రిజల్ట్ : సూపర్ హిట్
#11 హిట్లర్
మలయాళం సినిమా హిట్లర్ ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు.
రిజల్ట్ : సూపర్ హిట్
#12 రాజా విక్రమార్క
చిరంజీవి, అమల అక్కినేని, రాధిక నటించిన రాజా విక్రమార్క సినిమా కూడా కమింగ్ టు అమెరికా అనే ఒక అమెరికన్ మూవీ ఆధారంగా తీశారు.
రిజల్ట్ : ప్లాప్
#13 ప్రతిబంద్
చిరంజీవి హీరోగా నటించిన హిందీ సినిమా ప్రతిబంద్ కూడా అంకుశం సినిమా రీమేక్.
రిజల్ట్: సూపర్ హిట్
#14 ఎస్పీ పరశురామ్
చిరంజీవి హీరోగా నటించిన ఎస్పీ పరశురామ్ సినిమా కూడా తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించిన వాల్తేర్ వెట్రివల్ సినిమాకి రీమేక్.
రిజల్ట్ : సూపర్ హిట్
#15 ఆరాధన
చిరంజీవి ఆరాధనా వంటి ప్రయోగాత్మక సినిమాలు కూడా చేశారు. ఈ సినిమాని సత్యరాజ్ నటించిన కడలోర్ కవిదైగళ్ అనే ఒక తమిళ సినిమాకి రీమేక్‌గా రూపొందించారు.
రిజల్ట్ : డిజాస్టర్
#16 శంకర్ దాదా జిందాబాద్
ప్రభుదేవా దర్శకత్వంలో చేసిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా హిందీలో సంజయ్ దత్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లగే రహో మున్నాభాయ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.
రిజల్ట్ : డిజాస్టర్
#17 మృగరాజు
గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘మృగరాజు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ది హోస్ట్ అండ్ ది డార్క్నెస్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
రిజల్ట్: ప్లాప్
#18 ది జెంటిల్మెన్
ది జెంటిల్మెన్ సినిమాని హిందీ లో మహేష్ భట్ తెరకెక్కించారు. ఈ చిత్రం తమిళంలో శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జెంటిల్మెన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.
రిజల్ట్: ప్లాప్
#19 చక్రవర్తి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.
రిజల్ట్: ప్లాప్
#20 వేట
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.
రిజల్ట్: ప్లాప్
#21 పున్నమినాగు
పున్నమి నాగు సినిమా కన్నడలో హిట్టైన ‘హున్నిమేయ రాత్రియల్లి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.
రిజల్ట్: హిట్
#22 ఖైదీ నంబర్ 786
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.
రిజల్ట్ : బ్లాక్ బస్టర్
End of Article