Ads
కన్నడ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కేజీయఫ్ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కేవలం కన్నడ లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఊహించిన విధంగా కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యం కలిగించింది. కన్నడలో కేజీయఫ్ తర్వాత ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రం గా కాంతార నిలిచింది.
Video Advertisement
ఈ సినిమాను డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టికి మంచి గుర్తింపు లభించింది. అలాగే కాంతార సినిమాలో అతనే హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆధ్యాత్మికంగా… ఓ నమ్మకాలతో కూడిన కథతో తీశారు. ఇందులో ప్రజల నమ్మకాలు ఎలా ఉంటాయి… జనం తాము నమ్మకున్న దైవాన్ని ఎంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు అనే విషయాలు చూపించారు. సినిమా క్లైమాక్స్ చివరి పది నిమిషాల్లో రిషబ్ నటించిన విధానం అందరికి గూస్బంప్స్ తెప్పించేలా తెరకెక్కించారు. అయితే తాజాగా ఈ చిత్ర క్లైమాక్స్ గురించి రిషబ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సినిమాలో అడవి లోని ప్రజలు పంజుర్లి దేవతను నమ్మినట్టు గానే, తానూ పంజుర్లి దేవతని నమ్ముతానని రిషబ్ శెట్టి వెల్లడించారు. ప్రతి రోజూ ఆ దేవతను పూజించిన తర్వాతే తాను కాంతార సినిమా సీన్లను షూట్ చేసేవాడినని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా తమ ప్రాంతం లో దేవత ఆవహించిన వ్యక్తులను తానూ కళ్లారా చూశానని, తన అనుభవాల ద్వారా కాంతార క్లైమాక్స్ ఎలా ఉండాలో రాసి పెట్టుకున్నా అని ఆయన తెలిపారు.
“మనసులోనే కాంతార క్లైమాక్స్ లో తియ్యాల్సిన సీన్ల విజువల్స్ సిద్ధం చేసుకొని తెరకెక్కించాను. నా మనసులోని ఆలోచనలను డీఓపి కి మాత్రమే చెప్పాను. అందుకే క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో ప్రేక్షకుల లాగే.. మా చిత్ర బృందానికి కూడా తెలియదు. అలాగే సినిమాలో ఒక పాత్రలాగా హైలైట్ అయిన ‘ఓ’ అనే శబ్దం కూడా నేను అరిచినదే. డబ్బింగ్ సమయం లోనూ దాన్ని మార్చలేదు. మళ్ళీ ట్రై చేసినా సరిగ్గా రాలేదు. దీంతో అన్ని భాషల్లోనూ నా వాయిస్ ఏ ఉంటుంది.” అని రిషబ్ వెల్లడించారు.
End of Article