అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఓ సూపర్ హిట్ కోసం నానా కష్టాలు పడుతున్న రియా చక్రవర్తి ప్రస్తుతం దేశమంతటా హాట్ టాపిక్ గా మారిపోయింది. బాలీవుడ్ లోని చాలామంది ప్రముఖులు ఈమె సుశాంత్ ని టార్చర్ చేసేదని అతని డబ్బు అంతా జల్సాలు కోసం వాడేదని ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా సుశాంత్ సూసైడ్ కేసు కేంద్రం సీబీఐకి అప్పగించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ టైంలో సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారు. ఈ చిత్రంలో కళ్యాణ్ తన నటనకు ప్రేక్షకుల చేత మంచి మార్కులే వేయించుకున్నారు.ఇక ఈయన రెండవ చిత్రం “సూపర్ మచ్చి” లో మొదటగా రియా చక్రవర్తి హీరోయిన్ గా ఎంపికైంది.ఈ చిత్రంలో ఆమె కొన్ని రోజుల షూటింగ్ కూడా చేసింది. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా ఈ చిత్రం నుండి తప్పుకుంది. అంతకముందు “తూనీగ తూనీగ” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది రియా చక్రవర్తి.

“సూపర్ మచ్చి” నుండి రియా చక్రవర్తి సడన్ గా ఈ చిత్రం నుండి తప్పుకోవడంతో  ఈ చిత్రంలోకి ఆమె ప్లేస్ ను రీప్లేస్ చేయడానికి “రచిత రామ్” జాయిన్ అయ్యింది.

అయితే టాలీవుడ్ నెట్ కథనం ప్రకారం తాజాగా మెగా కజిన్స్ అందరూ కలిసిన సందర్భంలో కళ్యాణ్ దేవ్ ను రియా రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో చెప్పమని మెగా ఫ్యామిలీ వారంతా అతన్ని అడిగారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కెర్లు కొడుతుంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.