30 కోట్ల వాచ్… 43 లక్షల హ్యాండ్ బ్యాగ్..! నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కి బంధువు అయిన ఈమె ఎవరో తెలుసా.?

30 కోట్ల వాచ్… 43 లక్షల హ్యాండ్ బ్యాగ్..! నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కి బంధువు అయిన ఈమె ఎవరో తెలుసా.?

by Mohana Priya

Ads

కాలం ఎంత మారినా కూడా కాలంతో పాటు అంతే వేగంగా అభివృద్ధి చెందే రంగాల్లో ఫ్యాషన్ రంగం కూడా ఒకటి. ప్రతి సంవత్సరం కొత్త రకమైన ఫ్యాషన్స్ వస్తూ ఉంటాయి. ఫ్యాషన్ డిజైనర్లకి కూడా ఇండియాలో ఎటువంటి లోటు లేదు. భారతదేశంలో ఎంతో మంది పేరుపొందిన ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారు. వారంతా కూడా తమ స్టైల్ లో దుస్తులు రూపొందించి ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వారి దుస్తులకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల ఒక కొత్త ఫ్యాషన్ డిజైనర్ వెలుగులోకి వచ్చారు. ఆమె పేరు రియా కొడాలి. రియా కొడాలి ఒక ఫ్యాషన్ డిజైనర్.

Video Advertisement

riya kodali fashion designer

అంతే కాకుండా ఒక ఎంట్రప్రెన్యూర్ కూడా. రియా అమెరికాలో పుట్టారు. రియా తల్లిది ఏలూరు. తండ్రిది విజయవాడలోని గుణదల. నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కి ఈమె సమీప బంధువు అవుతారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఎన్నో అవార్డులు కూడా అనుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో రియా మాట్లాడుతూ, తాను ధరించిన వాచ్ ఖరీదు 30 కోట్లు ఉంటుంది అని, తాను వాడుతున్న బ్యాగ్ ఖరీదు 43 లక్షల ఖరీదు ఉంటుంది అని చెప్పారు. తన వాచ్ డైమండ్స్, బంగారం కలిపి కస్టమ్ మేడ్ గా చేయించుకున్న వాచ్ అని చెప్పారు. బర్బరీ అనే బ్రాండ్ కి చెందిన బ్యాగ్ రియా వాడుతున్నారు.

రియా కళ్ళద్దాలు కూడా 34 వేల ఖరీదు ఉంటాయి. తన ఆస్తి మొత్తం పదివేల కోట్ల వరకు ఉంటుందట. అంతే కాకుండా రియా ఒక ఎన్జీవో సంస్థ కూడా నడుపుతున్నారు. అందులో 2982 మంది బాధితులని రియా దత్తత తీసుకున్నారు. ఆ ట్రస్ట్ పేరు రియా కొడాలి చారిటబుల్ ట్రస్ట్. తనని కొంత మంది ఇబ్బంది పెట్టారు అని, అందుకే అలా ఇబ్బంది పడిన వారిని పోషిస్తున్నట్టు రియా తెలిపారు. చిన్నప్పుడే తన ఇంట్లో తనని సరిగ్గా చూసేవారు కాదు అని, ఈ కారణంగా పదో తరగతి అయిన తర్వాత ఇంట్లో నుండి బయటికి వచ్చేసాను అని చెప్పారు. అప్పుడు డిజైనర్ గా మారి ఇంత పెద్ద స్థాయికి ఎదిగారు అని చెప్పారు, 2025 లో ఐపీఎల్ టీమ్ కొంటాను అని కూడా రియా చెప్పారు.

watch video :


End of Article

You may also like