“వీడు ముసలోడు అవ్వకూడదే” అంటూ బేబమ్మ చెప్తే, మురిసిపోయాం.. కానీ, ఈ తెర వెనుక బేబమ్మ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

“వీడు ముసలోడు అవ్వకూడదే” అంటూ బేబమ్మ చెప్తే, మురిసిపోయాం.. కానీ, ఈ తెర వెనుక బేబమ్మ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

by Anudeep

Ads

“ఉప్పెన” సినిమా రిలీజ్ అవ్వడం కాస్త ఆలస్యం గానే రిలీజ్ అయినా.. ఉప్పెన లాంటి కలెక్షన్లతో ఈ సినిమా దూసుకెళ్లింది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ ఎంతగానో ఆకట్టుకున్నారు. కృతి శెట్టి అయితే.. ఇక చెప్పక్కర్లేదు. బేబమ్మ గా అందరి హృదయాలను దోచేసుకున్నారు. ఆమె పాత్ర అంతగా పండటానికి.. తెరపైన కృతి శెట్టి కారణం అయితే.. తెర వెనక మరొకరు ఉన్నారు.

Video Advertisement

rj swetha 1

ఆమె ఎవరో కాదు.. ఆర్ జె డార్లింగ్ శ్వేతా. ఆమె వాయిస్ లో ఎదో మేజిక్ ఉంటుంది. కేవలం వాయిస్ మాత్రమే కాదు.. అందం లోను ఆమె ఆకట్టుకుంటారు. ఆమె హీరోయిన్ గా ట్రై చేసినా కూడా మనం చూసి పడిపోతాం. “వీడు ముసలోడు అవ్వకూడదే..” , “మన ఇద్దరి మధ్యన ఆ ప్రేమ ఎందుకని.. ప్రేమనే పక్కన పెట్టేసా..” అంటూ ముద్దు ముద్దు గా ఆమె చెప్పే డైలోగ్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

rj swetha 2

శ్వేతా స్వస్థలం విశాఖపట్టణం. ఆమెకు చిన్నప్పటినుంచి థియేటర్లన్నా.. స్టేజి అన్నా మహా ఇష్టం. ఆ ప్యాషన్ తోనే డిగ్రీ కంప్లీట్ అవ్వగానే ఆమె హైదరాబాద్ కు వచ్చారు. ఆమె పేరెంట్స్ కూడా ఆమె ను చిన్నప్పటినుంచి ప్రతి విషయం లోను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అలా AD గా ఆమె తన కెరీర్ ను స్టార్ట్ చేసారు. ఆ తరువాత ఒక న్యూస్ ఛానల్ లో సబ్ ఎడిటర్ గా కూడా పనిచేసారు. ఆ తరువాత ఆమెకు మిర్చి లో రేడియో జాకీ గా అవకాశం లభించింది.

swetha

అలా ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎదిగారు. ఆమెకు సొంతం గా “స్విఫై” పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉందండోయ్.. అందుకోసం ఆమె సొంతం గానే కొన్ని యూట్యూబ్ వీడియోస్ ను కూడా షూట్ చేసారు. ఆమె డబ్బింగ్ ను ఎంతగానో ఇష్టపడతారు. ఆమె ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో కూడా ఈ విషయాన్నీ స్పష్టం చేసారు. డబ్బింగ్ ని వాయిస్ ఆఫ్ యాక్టింగ్ అని ఆమె చెబుతూ వస్తుంటారు. ఇందుకోసం ఆమె సినిమాలో క్యారెక్టర్ ని పూర్తి గా అర్ధం చేసుకోవాలని.. ఆ పాత్ర ఏ స్థాయిలో మాట్లాడాల్సి ఉంటుంది.. ఆ టెంపో తోనే డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుందని చెప్పుకొస్తారు.

rj swetha 4

బేబమ్మ కంటే ముందు ఆమె చాలా మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. చిత్రలహరి లో నివేత పేతురాజ్, అలానే మత్తు వదలరా సినిమాలో డ్రగ్ అడిక్ట్ గా కనిపించే అతుల్య కి కూడా చెప్పారు. రెండు చాలా డిఫరెంట్ రోల్స్.. రెండిటికి భిన్నమైన వాయిస్ ఉండాలి. ఆ డెప్త్ మైంటైన్ చేయడానికి శ్వేతా వంద శాతం పని చేస్తారు. ఇప్పటి వరకు ఆమె 8 లాంగ్వేజెస్ కి డబ్ చెప్పారు. దాదాపు యాభై సినిమాలకు ఆమె డబ్ చెప్పారు.

rj swetha 5

మంచి పేరు తెచ్చిపెట్టినవాటిల్లో.. చిత్రలహరి లో నివేత, వాల్మీకి లో పూజ హెగ్డే, హలో లో కళ్యాణి ప్రియదర్శిని, “అ” లో కాజల్ కు, మళ్ళీ రావా లో ఆకాంక్ష కు, భరత్ అనే నేను లో కియారా కు, వరల్డ్ ఫేమస్ లవర్ లో ఇజా.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే. సోషల్ మీడియా లో కూడా ఆమె చాలా ఆక్టివ్ గా ఉంటారు. ఆ రోజుల్లో.. ఈక్వాలిటీ గురించి మాట్లాడుతూ ఆమె ఓ వీడియో ను షేర్ చేసారు. అప్పట్లో ఈ వీడియో ఓ సంచలనమే సృష్టించింది. ఇంస్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసే వీడియోస్ కి కూడా చాలా మంది ఫాలోయర్స్ ఉన్నారు. డబ్బింగ్ మాత్రమే కాదు.. లైఫ్ లో ఏమి చేసినా మనస్పూర్తి గా చేస్తాను అని చెబుతోంది ఈ ఆఫ్ స్క్రీన్ బేబమ్మ.


End of Article

You may also like