ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు పూజా హెగ్డే. ప్రభాస్ తో పాటు రాధే శ్యామ్, అఖిల్ అక్కినేనితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటు మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా హీరోయిన్ గా నటిస్తున్నారు పూజా హెగ్డే. అయితే, కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.

పూజా హెగ్డే పై రోజా భర్త అలాగే తమిళ్ ఫిలిం ఫెడరేషన్ యూనియన్ చైర్మన్ అయిన సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమయం కథనం ప్రకారం, పూజా హెగ్డే ప్రొడక్షన్ ఖర్చులు పెంచారు అని, అలాగే నిర్మాతలకి భారంగా మారుతున్నారు అని ఒక సమావేశంలో సెల్వమణి అన్నారట. కెరీర్ స్టార్టింగ్ లో ఒకరిని లేదా ఇద్దరిని వెంట పెట్టుకొని వచ్చేవారట పూజా హెగ్డే. ఇప్పుడు ఏకంగా 12 మందిని తీసుకువస్తున్నారట.

షూటింగ్ కోసం అంతమందిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? దీనివల్ల నిర్మాతలకి ఖర్చు ఇంకా పెరుగుతోంది. ఇలా నిర్మాతల డబ్బులను వృధా చేయడం సరైన పద్ధతి కాదు అని సెల్వమణి చెప్పినట్టు ఒక వార్త ప్రచారంలో ఉంది. పూజా హెగ్డే తెలుగు, తమిళ్ లో మాత్రమే కాకుండా హిందీలో కూడా సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా, అలాగే రణవీర్ సింగ్ తో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయట.