రోజా వారసురాలిగా జబర్దస్త్ లోకి వచ్చేది వారేనా..?

రోజా వారసురాలిగా జబర్దస్త్ లోకి వచ్చేది వారేనా..?

by Sunku Sravan

Ads

అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రోజా మంత్రిగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పర్యాటకం,సాంస్కృతికం, యువజన సర్వీసుల శాఖ మంత్రిత్వం ఆమెకు లభించింది. ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందే ఆమె ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

Video Advertisement

సినీ జీవితానికి తెర దించారు. ఇకపై సినిమాల్లో నటించట్లేదని ప్రకటించారు. ఇక ఒక ప్రైవేటు ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న స్టాండప్ కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సైతం గుడ్ బై చెప్పారు. ఇక ఇప్పట్లో రోజా సినిమాలో నటించే అవకాశం లేదనే చెప్పాలి.

సినిమాలకు దూరం కావడం, జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో పాల్గొననంటు రోజా చేసిన ప్రకటనల పట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. శాసనసభ్యురాలిగా ఉన్న సమయంలో జబర్దస్త్ లాంటి టీవీ షోలలో పాల్గొనడం పట్ల వైసిపి కార్యకర్తలు పలు సందర్భాల్లో అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే హోదాలో ఉండి అలాంటి కార్యక్రమాలు చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మంత్రిగా వచ్చిన తర్వాత ఆమె మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రోత్సహిస్తున్నారు. ఇక ఆమె జడ్జీగా మానేసిన తర్వాత ఇక ఇప్పుడు ఎవరు జడ్జిగా వస్తారనేది చూడాలి.తోటి జనసేన పార్టీ సీనియర్ నాయకుడితో కలిసి న్యాయనిర్ణేతగా నాగబాబు తో కలిసి చాలా ఏళ్లు పనిచేసింది.

ఆ తర్వాత నాగబాబు మానేశారు. ఇప్పుడు రోజా గారు కూడా మానేశారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ విషయంలో ఎవరు బాధ్యతలు తీసుకుంటారు? ఆ హోదాకు తగ్గట్టు ఎవరు ఉంటారు? ఆమె వారసులు ఎవరనేది? ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు తెరమీద రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి ఇంద్రజ, రెండు ఆమని.. వీరిద్దరిలో ఒకరితో ఆ ఛానల్ యాజమాన్యం కాంట్రాక్టు కుదుర్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇందులో ఇంద్రజ వైపే అందరూ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇదివరకు రోజా అనారోగ్యానికి గురైన సమయంలో ఆమె వచ్చి మంచిగా ఫిక్సయ్యింది. ఇంద్రజ కు న్యాయం నిర్ణేతగా చేసే అవకాశాలు లేకపోలేదంటూ చెబుతున్నారు. రోజా కోలుకున్న తర్వాత మళ్ళీ జబర్దస్త్ లోకి వచ్చినా ఇంద్రజ అక్కడి నుండి వెళ్ళిపోయి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరు ఆమె వారసురాలిగా వస్తారంటే ఆమని పేరు కూడా వినిపిస్తోంది.


End of Article

You may also like