రోజాకు అన్నగా, భర్తగా నటించిన హీరో ఎవరో తెలుసా..? ఏ సినిమాల్లో నటించారు అంటే.?

రోజాకు అన్నగా, భర్తగా నటించిన హీరో ఎవరో తెలుసా..? ఏ సినిమాల్లో నటించారు అంటే.?

by kavitha

Ads

ఒక సినిమాలో అన్న చెల్లెలుగా నటించిన హీరో హీరోయిన్లు మరోక సినిమాలో భార్యాభర్తలుగా నటిస్తుంటారు. ఇలా నటించటానికి వారికి ఎలాంటి భావన రాదు. నటీనటులు వారి పాత్రలకు న్యాయం చేయాల్సి ఉంటుంది. అయితే హీరోహీరోయిన్లుగా నటించినపుడు రొమాంటిక్ సన్నివేశాలు కూడా చేయాల్సి వస్తుంది.

Video Advertisement

ఎన్టీఆర్ కి బడిపంతులు సినిమలో మనవరాలుగా నటించిన శ్రీదేవి, ఆ తరువాతి కాలంలో పలు సినిమాలలో ఆయనకు జంటగా  నటించి, హిట్ పెయిర్ గా నిలిచారు. తెలుగు చిత్రాలలో ఇలాంటివి చాలామంది హీరోహీరోయిన్లకు ఎదురయ్యాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా తనకు అన్నయ్యగా నటించిన హీరోకి ఆ తరువాతి కాలంలో జంటగా నటించాల్సి వచ్చింది. ఆ సీనియర్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..

సీనియర్ నటి రోజా 90 దశకంలో  స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి టాప్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలలో  నటించింది. 2000 సంవత్సరం వరకు హీరోయిన్ గా రాణించింది. ఆ తర్వాత సినిమాలలో కీలక పాత్రలలో నటించారు. తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించిన మూడవ సినిమా సీతారత్నం గారి అబ్బాయి.

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1992 లో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో వినోద్ కుమార్ హీరోగా నటించగా ఆయనకు జంటగా రోజా నటించారు. అలనాటి నటి వాణిశ్రీ కీలక పాత్రలో నటించగా, రోజా అన్నయ్యగా శ్రీకాంత్ నెగిటివ్ పాత్రలో నటించారు. అప్పటికి శ్రీకాంత్ ఇంకా హీరోగా మారలేదు. శ్రీకాంత్ హీరోగా మారి, స్టార్ హీరో అయిన తరువాత రోజాకు జోడీగా నటించారు.

2000లో వీరిద్దరు జంటగా నటించిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ మూవీలో రోజా శ్రీకాంత్ కి భార్యగా నటించారు. అదే ఏడాది వీరిద్దరు తిరుమల తిరుపతి వెంకటేశా సినిమాలో జంటగా నటించారు. ఇలా ఒకప్పుడు అన్నయ్యగా నటించిన శ్రీకాంత్ తో రోజా హీరోయిన్ గా చేసింది. శ్రీకాంత్ ఓ సందర్భంలో మాట్లాడుతూ “రోజా తనను అన్నా అని పిలిచేదని,  సాంగ్స్, రొమాన్స్ షూటింగ్ చేసేటపుడు కూడా అన్నా అనేదని,  అలా పిలిస్తే,  ఆ ఫీల్ రావట్లేదని రోజా పై కోప్పడినట్టు చెప్పుకొచ్చాడు.

Also Read: MUKHYA GAMANIKA MOVIE REVIEW: అల్లు అర్జున్ బావమరిది నటించిన మూవీ ఎలా ఉంది..?స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

 


End of Article

You may also like