తెలుగు చిత్ర పరిశ్రమలో రోజా మంచి పేరు తెచ్చుకున్నారు. రోజా అందరికీ సుపరిచితమే. కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. చాలా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయారు రోజా. అలానే రాజకీయాలలో కూడా చురుగ్గా ఉంటారు రోజా.

Video Advertisement

ఇప్పటికి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంత్రి హోదా లో రోజా ఉన్నారు. అయితే సినిమాలు మానేసినా కూడా ఆమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉంటారు.

జబర్దస్త్ లో జడ్జ్ కింద కూడా వ్యవహరించారు. అలానే బుల్లి తెర మీద ఎప్పటికప్పుడు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఆ వేడుకలలో రోజా పాల్గొంటూ ఉంటారు. ఒక వైపు సినిమా రంగం లో మరొక వైపు రాజకీయాల్లో కూడా ఈమె ఎంతో ఎదిగారు. అయితే పైకి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విమర్శలు తప్పవు. ప్రతీ ఒక్కరికి కూడా విమర్శలు వస్తూ ఉంటాయి. ఎంతమంది అభిమానించే వాళ్ళు వుంటారో అంతేమంది విమర్శించే వాళ్ళు కూడా వుంటారు. అయితే ఏ రంగం లో అయినా సరే ఇవి తప్పవు. ఎప్పుడూ కూడా ఎదిగే వాళ్ళ మీద ట్రోల్స్ చేయడం కామన్ గా జరిగేదే. అయితే ఒక్కొక్క సారి బయట చేసే కామెంట్లు ఇంట్లో వాళ్ళని ఎంతగానో బాధ పెడుతూ ఉంటాయి. అయితే రోజా కుమార్తె అన్షు మాలిక్ కూడా ఎన్నో బాధలని ఎదుర్కొన్నారట.

roja daughter entering into film industry

ఈ విషయాన్ని రోజా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కొందరు రోజా కూతురు ఫోటోలని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్ట్ చేశారని… అది చూసిన తన కూతురు అన్షు బాధపడ్డారని అన్నారు రోజా. అది చూసిన తన కూతురు ఇలాంటివి అన్నీ మనకి అవసరమా అని అడిగిందని రోజా అన్నారు. అయితే ఇటువంటివన్నీ చాలా కామన్ గా సెలబ్రెటీలకి ఎదురవుతూ ఉంటాయని… తన పిల్లలకి అర్థమయ్యేలా రోజా చెప్పారట. అయితే ప్రస్తుతం అన్షు గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.