“మహేష్ బాబు” నుండి… “విజయ్ దేవరకొండ” వరకు… ఈ 6 నటులని “స్టార్” గా మార్చిన పాత్రలు..!

“మహేష్ బాబు” నుండి… “విజయ్ దేవరకొండ” వరకు… ఈ 6 నటులని “స్టార్” గా మార్చిన పాత్రలు..!

by Anudeep

Ads

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు ఉంటారు కానీ ఆ నటుల్లో కొంతమంది మాత్రమే స్టార్స్ గా ఎదుగుతారు. ఎన్ని సినిమాలు చేసినా రాని పేరు గుర్తింపు కొన్ని పాత్రలు తీసుకొస్తాయి. అలా ఎందరో నటులు, నటీమణులు ఒక ప్రత్యేక పాత్రతో జనాల్ని హుక్ చేసి లాక్ చేస్తారు.

Video Advertisement

అలాంటి పాత్రలు పడినప్పటి నుండి స్టార్ గా మారతారు. అలా టాలీవుడ్ లో గుర్తింపు పొందిన కొంతమంది నటులను చూద్దాం. .

#1 ప్రకాష్ రాజ్: 


ఒకప్పుడు ప్రకాష్ రాజ్ మూస పద్దతిలో విలన్ పాత్రలే చేస్తున్నాను అని కొన్నాళ్ళు సినిమాలు చేయడం మానేశాడు. అదే సమయంలో కృష్ణ వంశీ అంతఃపురం సినిమా స్క్రిప్ట్ తో వస్తే వెంటనే ఒకే చెప్పాడు. కారణం ఆ పాత్ర అలాంటిది. విలన్ కి కారెక్టర్ ఆర్టిస్ట్ కి మధ్యలో సీమ మాండలికం, ఊరి పెద్ద కానీ మనవడి విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రేమ అన్నీ కలిపి సినిమా ని ఒక హిట్ చేస్తే ప్రకాష్ రాజ్ కి తెలుగులో సూపర్ బ్రేక్ ఇచ్చి రెడ్ కార్పెట్ పరిచిన చిత్రం.

#2 శ్రీహరి: 


రియల్ హీరో శ్రీహరి అప్పటి వరకు ఒకే పద్దతిలో విలన్ పాత్రలు చేస్తూ ఉన్న సమయంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో అన్న పాత్ర చేయడంతో ఒక్కసారిగా తన కెరీర్ లో బిజీ అయిపోయాడు. అప్పటి వరకు శ్రీహరి హీరోగా, విలన్ గా చేసినప్పయికీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా శ్రీహరి కెరీర్ లో మైలురాయిగా మిగిలిపోయింది.

#3 జగపతిబాబు:


అలాగే జగపతిబాబు వరుసగా హీరోగా చేస్తూ డక్కముక్కీలు పడుతున్న సమయంలో లెజెండ్ లో జితేంద్ర కారెక్టర్ తో జగపతిబాబు లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. తన నటనలో మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాడు.

#4 మహేష్ బాబు:


అలాగే మహేష్ బాబు రాజకుమారుడు నుండి ఒక్కడు వరకు మూడు సినిమా హిట్లు మూడు సినిమాలు ఫ్లాప్. అయితే ఒక్కడు సినిమాతో మంచి హిట్ పడ్డప్పటికీ పోకిరీతో మాస్ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు మహేష్.

#5 విజయ్ దేవరకొండ:


అప్పటి వరకు సాధారణ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండను అర్జున్ రెడ్డి స్టార్ హీరోని చేసి యూత్ లో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. అప్పటి నుంచి విజయ్ కెరీర్ లో వెనిక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో బిజీ అయిపోయాడు.

#6 ఆది పినిశెట్టి:


తెలుగు దర్శకుడు రవిరాజా పినిశెట్టి అబ్బాయిగా “ఒక వి చిత్రం” అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసిన ఆది పినిశెట్టి, తమిళంలో హీరోగా సెటిల్ అయ్యి.. మళ్లీ టాలీవుడ్ లోకి వచ్చాడు. సరైనోడులో విలన్ క్యారెక్టర్ ఆది కెరీర్ ని మలుపు తిప్పింది. అప్పటు వరకు చూడని ఓ కొత్త విలనిజంను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు ఆది.


End of Article

You may also like