ఎన్టీఆర్ – ఒలీవియా మధ్య వచ్చే ఆ రొమాంటిక్ సాంగ్ ను డిలీట్ చేసారా..? ఎందుకు..?

ఎన్టీఆర్ – ఒలీవియా మధ్య వచ్చే ఆ రొమాంటిక్ సాంగ్ ను డిలీట్ చేసారా..? ఎందుకు..?

by Sunku Sravan

Ads

ఆర్ఆర్ఆర్ ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి, ఇంకా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ ఎంతో మంది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అంతటి హిస్టరీ సృష్టించిన ఈ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో మార్చి 25న విడుదలై చరిత్ర తిరగరాస్తోంది.

Video Advertisement

ఇప్పటికే బాహుబలి రికార్డులను దాటి ముందుకు దూసుకుపోతోంది. కానీ మూవీ లో కొన్ని సీన్లను జక్కన్న డిలీట్ చేయించారట. ఆ సీన్లు ఉంటే సినిమా ఇంకా 4 అవర్స్ రన్ టైం వరకు వెళ్లేదని అంటున్నారు.

ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి రొమాంటిక్ సాంగ్ ను కట్ చేశారని సమాచారం. ఇంకొంతమంది అయితే సినిమాలో రెండు పాటలని డిలీట్ చేసినట్టు చెబుతున్నారు. వీటిలో ఎంత నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ పాట అయితే కచ్చితంగా డిలీట్ చేశారని తెలుస్తోంది. ఈ సాంగ్ కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ఒలీవియా మోరిస్ ల మధ్య సాగినటువంటి ఒక రొమాంటిక్ సాంగ్ గా చెబుతున్నారు.

ఈ పాట నిడివి కూడా మూడు నిమిషాలకు పైగా, దీన్ని సినిమా చివరి సమయంలో వద్దనుకున్నారు అని తెలుస్తోంది. నిడివి ఎక్కువ అవడంతో  ఈ పాట తో పాటుగా ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలను కూడా డిలీట్ చేశారట. ఇదిలా ఉండగా చరణ్ మరియు ఆలియాభట్ ల మధ్య కూడా రొమాంటిక్ సాంగ్ ఉండాలని, షూటింగ్ మొదలు పెట్టి మధ్యలో ఆపేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్, ఒలీవియా మధ్య ఉన్న ఈ సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


End of Article

You may also like