తెలుగు ఇండస్ట్రీ లోనే టాప్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో అంతటి ఆదరాభిమానాలు సంపాదించిన హీరో అని చెప్పవచ్చు. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నా ఆయన ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే చాలు తన కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ సందర్భంలోనే ఆయన సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సార్లు అయినా కుటుంబంతో హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ తరుణంలో తన ఫ్యామిలీతో కలిసి ప్యారీస్ వెళ్లారు మహేష్ బాబు.

Video Advertisement

అక్కడి ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తన కుటుంబంతో కలిసి ప్యారీస్ వెళ్లిన మహేష్ బాబు అక్కడి లగ్జరీ హోటల్ లీ బ్రిస్టల్ ప్యారిస్ లో దిగడం ఆయనకు అలవాటు. ఎంతో విలాసవంతమైన హోటల్లో అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అందుకే మహేష్ బాబు ఎప్పుడు వెళ్ళినా అదే హోటల్లో ఉంటారు. అయితే ఆ హోటల్ కు మహేష్ బాబు ఒక రోజుకి ఎంత చెల్లిస్తారో తెలిస్తే అందరూ షాక్ అవుతారు.

ఎన్నో ఆధునిక సదుపాయాలున్నటువంటి ఆ రూమ్ కు మహేష్బాబు రోజుకి లక్షన్నర రూపాయలు రెంట్ గా చెల్లిస్తారట.. ఇంత పెద్ద స్టార్ కు ఆమాత్రం ఉండకపోతే బాగుండదు కదా. ఈ విధంగా మహేష్ బాబు తన కుటుంబం కోసం ఏ మాత్రం సమయం దొరికినా వారితో కలిసి ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు. అయితే సర్కారు వారి పాట మే 12వ తేదీన విడుదల అవుతోంది కాబట్టి మళ్లీ మహేష్ బాబు ఇండియాకు రానున్నట్లు నమ్రత సోషల్ మీడియాలో వెల్లడించింది.