• చిత్రం : రౌడీ బాయ్స్
  • నటీనటులు : ఆశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్.
  • నిర్మాత : దిల్ రాజు
  • దర్శకత్వం : శ్రీ హర్ష కొనుగంటి
  • సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
  • విడుదల తేదీ : జనవరి 14, 2022.

rowdy boys movie review

Video Advertisement

స్టోరీ :

అక్షయ్ (ఆశిష్) LIT కాలేజ్ లో ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాడు. కావ్య (అనుపమ పరమేశ్వరన్) BMC మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ చదువుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి ప్రేమ కథ ఏంటి? అక్షయ్ కి కాలేజ్ లో ఎదురైన సమస్యలు ఏంటి? ఆ గొడవలని ఎలా పరిష్కరించుకున్నాడు? చివరికి అక్షయ్ సమస్యలన్నీ తీరాయా? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

rowdy boys movie review

రివ్యూ :

దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా కోసం ఆశిష్ చాలా కష్టపడినట్లు తెలిసిపోతోంది. డాన్స్ విషయంలో కానీ, యాక్షన్ విషయంలో కానీ చాలా జాగ్రత్త తీసుకున్నారు. అక్షయ్ పాత్ర ఆశిష్ కి సూట్ అయ్యింది. మళ్లీ చాలా రోజుల తర్వాత అనుపమ పరమేశ్వరన్ తెరపై కనిపించారు. అనుపమ మేకోవర్ కూడా పాత్రకి తగ్గట్టుగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో కాలేజీ గొడవలు తప్ప మిగిలిన విషయాలు ఏవీ పెద్దగా చూపించరు. కేవలం ఆ ఒక్క విషయంపై మాత్రమే ఫస్ట్ హాఫ్ మొత్తం నడుస్తుంది.

rowdy boys movie review

సెకండ్ హాఫ్ లో కొన్ని మంచి సీన్స్ ఉన్నా కానీ, అవన్నీ అంతకు ముందు మనం ఎక్కడో చూసినట్టే అనిపిస్తూ ఉంటాయి. అనుపమ, ఆశిష్ పెయిర్ బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి. అక్కడక్కడా కొంత వరకు కామెడీ వర్కౌట్ అయ్యింది. సినిమా ట్రైలర్ లో చూపించినట్టే ఒక యూత్ ఫుల్ స్టోరీ. అయినా కూడా వేరే నటీనటులతో అంతకుముందు ఎప్పుడో చూసిన సినిమానే ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం అని అనిపిస్తూ ఉంటుంది.

ప్లస్ పాయింట్స్ :

  • హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
  • దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీ

రేటింగ్ :

2/5

ట్యాగ్ లైన్ :

సినిమాలో కొత్తదనం లేకపోవడం, అలాగే ఎక్కువగా యూత్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా అవడంతో రౌడీ బాయ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఉండకపోవచ్చు.