RRR “ఎత్తర జెండా” పాటలో ఈ స్టెప్ గమనించారా..? ఇదే స్టెప్ ఆ “స్టార్ హీరో” సినిమాలో చేస్తే ట్రోల్ చేసారుగా..?

RRR “ఎత్తర జెండా” పాటలో ఈ స్టెప్ గమనించారా..? ఇదే స్టెప్ ఆ “స్టార్ హీరో” సినిమాలో చేస్తే ట్రోల్ చేసారుగా..?

by Megha Varna

Ads

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం.

Video Advertisement

రాజమౌళి వారిద్దరిని తెర మీద ఎంతో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా ఈ ఇద్దరి హీరోల మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. సినిమా విడుదలకు ముందే పాటలు విడుదల చేశారు.

ఈ పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచాయి. ఇక ఇది ఇలా ఉంటే కొన్ని డాన్స్ మూవ్మెంట్స్ కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. నాటు నాటు స్టెప్ గురించి అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎక్కడ చూసినా అదే స్టెప్పు.

అలానే నెత్తురు మండితే ఎత్తర జెండా పాటలో స్టెప్ కూడా ఫేమస్ అయ్యింది. అయితే ఈ స్టెప్ అందరు బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ భీమ్లా నాయక్ లో ఇలాంటి స్టెప్పు ని ఒకటి పెట్టగా.. అది ట్రోల్స్ కి గురైంది. ఆ స్టెప్ ని గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు.

భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ లో స్టేజ్ మీద ఆ స్టెప్ కూడా వేశారు కానీ తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి. ఆర్ఆర్ఆర్ లో అలాంటి స్టెప్ కి మాత్రం ఏ నెగటివ్ కామెంట్స్ రాలేదు.


End of Article

You may also like