ప్రేమ్ రక్షిత్ పాపులారిటీని సంపాదించుకుంటున్న కొరియోగ్రాఫర్. ఆస్కార్ అవార్డు వచ్చిన నాటు నాటు పాటకి కొరియోగ్రఫీ అందించారు. దీంతో ఇంకాస్త పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ పేరు కూడా ఎక్కువగానే వినపడుతోంది. పైగా కొరియోగ్రఫీ ని చూసి అందరూ అభినందిస్తున్నారు. ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ప్రపంచ వ్యాప్తంగా కూడా పాపులర్ అయిపోయింది.

Video Advertisement

ఈ డాన్స్ ని చూసి హాలీవుడ్ స్టార్లు కూడా చేస్తున్నారు. నాటు నాటుతో నిజంగా ప్రేమ రక్షిత్ ఒక మెట్టు ఎక్కేసాడు. నాటు నాటు కొరియోగ్రఫీ తో ఆయనకి మరెన్నో అవకాశాలు భవిష్యత్తు లో తప్పక వస్తాయి. నాటు నాటు డాన్స్ మూవ్స్ కూడా ఎంతో బాగుంటాయి.

the story behind RRR 'natu natu' song..!!

టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్ఫాములలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన పాటకి ఎంత క్రేజ్ వచ్చిందో మీకే తెలుసు. పైగా అవే మూవ్ చాలామంది చేస్తున్నారు. అయితే మీకు ఒక విషయం తెలుసా…? ఒకప్పుడు ప్రేమ్ రక్షిత్ ఎంతగానో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. కేవలం 50 వేల రూపాయల కి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఎంతగానో ఇబ్బందులు పడ్డాడు. కుటుంబ పరిస్థితులు అప్పట్లో బాగుండేవి కాదు.

కనుక ఆత్మహత్య చేసుకుంటే డాన్స్ యూనియన్ ఫెడరేషన్ నుండి 50 వేల రూపాయలు చనిపోయాక వస్తాయని అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మెరీనా బీచ్ కి సూసైడ్ చేసుకోవడానికి తన స్నేహితుడు సైకిల్ మీద వెళ్ళాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ ఇంటికి వచ్చి సైకిల్ అడుగుతాడు అని ఇంటికి సైకిల్ ఇచ్చేద్దాం అని వెళ్ళాడు.

ఆ తర్వాత మెరీనా బీచ్ కి నడిచి వెళ్లాలని అనుకున్నాడు. తన తండ్రి వెనక్కి పిలిచి నీకు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పారు. అప్పటి నుండి కూడా వెనకడుగు వేయలేదని కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ చెప్పారు. ఇలా అప్పటి నుండి కూడా ప్రేమ్ రక్షిత్ నమ్మకం పెట్టుకుంది కష్ట పడుతున్నాడు.