ప్రస్తుతం మన ఇండస్ట్రీలో నడుస్తున్న టాపిక్ ఆర్ ఆర్ ఆర్ అప్డేట్. అసలు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇంత ఆసక్తిగా ఎదురు చూడడానికి, ఒకటి కాదు చాలా కారణాలు ఉన్నాయి.ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్రీమ్ కాంబినేషన్, రాజమౌళి దర్శకత్వం, తో సినిమా అభిమానుల్లో మొదలైన ఎగ్జైట్మెంట్, తర్వాత ఐదు భాషల్లోనూ  విడుదలైన మోషన్ పోస్టర్,ఆ తర్వాత రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన భీమ్ ఫర్ రామరాజు వీడియో, అలాగే ఆర్ ఆర్ ఆర్ ఆర్ టీం నుండి వచ్చే అప్డేట్స్ తో ఆ ఎగ్జైట్మెంట్ కొంచెం కొంచెం గా పెరుగుతూనే ఉంది.

Video Advertisement

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ కోసం అందరూ ఎదురు చూశారు. కానీ కరోనా కారణంగా అప్డేట్ విడుదల చేయలేక పోయారు. ఇటీవల సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది.దాంతో “అప్డేట్ ఎప్పుడా?” అనే ఆసక్తి కూడా అందరిలో మళ్ళీ మొదలైంది. అక్టోబర్ 22వ తేదీన, రామరాజు ఫర్ భీమ్ విడుదల చేయనున్నట్టు సినిమా బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

ముందు రిలీజ్ చేసిన రామరాజు ఫర్ భీమ్ అప్డేట్ లో  సమయం చెప్పకపోవడంతో “ఏ టైం కి విడుదల అవుతుంది?” అనే ప్రశ్న మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానంగా మొన్న చిత్ర బృందం అక్టోబర్ 22వ తేదీ రోజు రామరాజు ఫర్ భీమ్ అని చెప్తూ దానితో పాటు, పదకొండు గంటలకి అని సమయం కూడా ప్రకటించారు. దాంతో అక్టోబర్ 22వ తేదీ కోసం సినిమా అభిమానులు అందరూ ఆసక్తితో ఎదురు చూశారు. అక్టోబర్ 22వ తేదీ రానే వచ్చింది. మొత్తం మీద చిత్ర యూనిట్ RRR అప్డేట్ విడుదల చేసింది. వీడియో చూసేయండి .

వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండ్రు బెబ్బులి.. కొమురం భీమ్` అంటూ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో ఎన్టీయార్ పాత్రను పరిచయం చేశారు.

rrr dialogue

rrr dialogue