Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకున్నారు.
Video Advertisement
ఇటీవల సినిమా విడుదలయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ విషయం చాలా మంది నిరాశకు గురి చేసింది.
Also Read —> “అనిల్ రావిపూడి” తో RRR టీమ్ ఇంటర్వ్యూపై 10 మీమ్స్..!
ఈ సినిమా మార్చ్ లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది. చెప్పినట్టే విడుదల చేయడం, ఆ తర్వాత ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకోవడం అనేవి భారత దేశ స్థాయిని ఇంకా పెంచాయి. అయితే ఈ సినిమాలో ఎత్తర జెండా పాట సినిమా విడుదలకి ముందే విడుదల చేశారు. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఆలియా భట్ కూడా కనిపించారు. అయితే ఈ పాటపై ఇటీవల ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఆ ట్వీట్‌కి సినిమా బృందం కూడా సెటైరికల్ గానే రిప్లై ఇచ్చారు. పాటలో చాలా చోట్ల కోడే అన్న పదం వస్తుంది.
దానిపై కామెంట్ చేస్తూ,”కోడి ఏంట్రా?” అని అడిగారు. సాధారణంగా కూడా పదం విన్న అందరికీ కోడి అనే అనిపిస్తుంది. కానీ దాని అర్థం అది కాదు అంటూ సినిమా బృందం రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్‌కి ఆర్ఆర్ఆర్ సినిమా బృందం, “కోడె అది. కోడె గిత్తలు లాగ అని. పాట మొదట్లో వచ్చే డైరెక్టర్ గారి వాయిస్ ఓవర్ ఒకసారి వినండి :)” అని రిప్లై ఇచ్చారు. ఇది మాత్రమే కాదు అంతకు ముందు కూడా ఇలాంటి చాలా ప్రశ్నలకు ఈ సినిమా బృందం ఇలాగే రిప్లై ఇచ్చారు.
End of Article