ఎలక్షన్ 2023 : ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి..? ఎలాంటి పనులు చేయకూడదు..?

ఎలక్షన్ 2023 : ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి..? ఎలాంటి పనులు చేయకూడదు..?

by kavitha

Ads

తెలంగాణ రాష్ట్రంతో సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలెక్షన్స్ కు షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఎన్నికల కోడ్ సోమవారం నుండి అమలులోకి వచ్చింది. ఈ కోడ్ గవర్నమెంట్ కు, రాజకీయ పార్టీలకు, ఎలెక్షన్స్ లో పాల్గొనే అభ్యర్థులకు వర్తిస్తుంది.

Video Advertisement

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఎలెక్షన్స్ జరిగే రాష్ట్రాలలో ప్రభుత్వం ఏది చేయాలనుకున్నా కూడా  కోడ్ రూల్స్ కు లోబడే చేయాల్సి ఉంటుంది. అయితే ఏం చేయవచ్చు? ఏం చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, లీడర్లకు వర్తించేలా తమ నియమావళిలో భాగంగా పలు సూచనలు చేసింది.

# కులాలు లేదా మతాల మధ్య విభేదాలను పెరిగేలా మాట్లాడడం కానీ, వైషమ్యాలు సృష్టించడం వంటివి చేయకూడదు.

# ఇతర పార్టీలను విమర్శించే సమయంలో పార్టీ విధానాలు, కార్యక్రమాలు, గతంలో పనితీరు లాంటి విషయాల కే పరిమితం కావాలి.

# ఆధారాలు లేకుండా ఇతర నాయకులు, పార్టీలు, కార్యకర్తల పై ఆరోపణలు చేయకూడదు.

# ఎలెక్షన్స్ ప్రచారం కోసం పవిత్ర స్థలాలు అయిన ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి వాటిని ఎట్టి పరిస్థితులలోనూ వాడకూడదు.

# ఓట్ల కోసం డబ్బులివ్వడం, బెదిరించడం వంటివి చేయకూడదు.

# పార్టీలు, అభ్యర్థులు వేరేవారి స్థలంలో, గోడలు, ఇళ్లు వంటివాటిని వారి పర్మిషన్  లేకుండా ప్రచారానికి ఉపయోగించుకోకూడదు.

# వేరే పార్టీల, లేదా అభ్యర్థుల పోస్టర్లు, ఫ్లెక్సీలు, వంటి వాటిని తొలగించకూడదు.
ఏం చేయవచ్చు..

# ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు మొదలుపెట్టిన స్కీములు, కార్యక్రమాలు కొనసాగించవచ్చు.కరవు, వరదలు వంటివి వస్తే ఆ ప్రాంతాలలో సహాయ, పునరావాస చర్యలు తీసుకోవచ్చు.

# తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి వైద్యం చేయించడం కోసం నగదు సాయం వంటివాటికి అనుమతులు తీసుకుని చేయవచ్చు.

# ఎలెక్షన్స్ సభలు పెట్టడం కోసం బహిరంగ స్థలాలను ఇతర పార్టీలకు, ఇతర అభ్యర్థులకు అందుబాటులో ఉండేలా వ్యవహరించాలి.

# ఇతర పార్టీల పథకాలు, విధానాలు, వారు చేసే కార్యక్రమాలను కూడా విమర్శించవచ్చు.
ఏం చేయకూడదు..

# అధికార పార్టీ ప్రభుత్వ సొమ్మును ఉపయోగించి ప్రకటనలు ఇవ్వకూడదు.
అభ్యర్థిగా, ఓటరుగా, ఏజెంట్‌గా తప్ప మినిస్టర్స్ గా మాత్రం పోలింగ్ సెంటర్స్ లోకి లేదా, లెక్కింపు  సెంటర్స్ లోకి కానీ వెళ్లకూడదు.

# ఓట్లు అడగడానికి కులం, మతాలను ఉపయోగించుకోకూడదు.

# ఇతర పార్టీల లీడర్లు, అభ్యర్థుల వ్యక్తిగత జీవితం పై విమర్శలు చేయకూడదు.
తమ అభిప్రాయాలు లేదా విధానాలతో ఏకీభవించని వ్యక్తుల ఇంటి ముందు నిరసనలు లేదా  ప్రదర్శనల వంటివి చేయకూడదు.

# అధికారిక సెక్యూరిటీ లేదా ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నవారిని ఎన్నికల ఏజెంటుగా లేదా పోలింగ్ ఏజెంటుగా లేదా కౌంటింగ్ ఏజెంటుగా నియమించకూడదు.

Also Read: ఎలెక్షన్స్ లో ఒకేసారి ఒక అభ్యర్థి 2 కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయకూడదా..? దీని గురించి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తోంది అంటే..?


End of Article

You may also like