“థ్యాంక్యూ” చిత్రం రన్ టైం మరి ఇంత తక్కువా..? ఈ చిత్రంతో నాగ చైతన్య ఖాతాలో మరో హిట్ పడనుందా..?

“థ్యాంక్యూ” చిత్రం రన్ టైం మరి ఇంత తక్కువా..? ఈ చిత్రంతో నాగ చైతన్య ఖాతాలో మరో హిట్ పడనుందా..?

by Anudeep

Ads

విక్రం కె కుమార్ దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రానికి గాను నాగచైతన్య సరసన హీరోయిన్గా రాశిఖన్నా నటిస్తుంది. ఈ జూలై 22వ తేదీన థ్యాంక్యూ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలో రాబోతుంది. మనం చిత్రం తరువాత దాదాపు 8 సంవత్సరాలకి విక్రం కె కుమార్ మరియు నాగచైతన్య కాంబినేషన్ లో రాబోతుంది ఈ థాంక్యూ మూవీ.

Video Advertisement

విక్రం కె కుమార్ డైరెక్షన్ గురించి వేరే చెప్పనవసరంలేదు. ఆయన చేసే చిత్రాలకు ప్రేక్షకులల్లో ఎంతో క్రేజ్ ఉంటుంది. థ్యాంక్యూ చిత్రంలో నాగచైతన్య మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారని ఇటీవల విడుదలైన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.  మాళవిక నాయర్, అవికా గోర్, ప్రకాష్ రాజ్, సాయి సుశాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

naga chaitanya thank you

ఈ చిత్రానికి గానూ తమన్ సంగీత సారథ్యం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో  తమన్ మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం కేవలం 2:09 గంటల రన్ టైం మాత్రమే ఉందని వార్త ప్రచారం అవుతుంది. ఇటీవల కాలంలో ఇంత తక్కువ నిడివితో వచ్చిన చిత్రమిది అని చెప్పవచ్చు అంటూ బయట టాక్ వినిపిస్తుంది. మనం చిత్రం నాగచైతన్య మరియు విక్రం కె కుమార్ కాంబినేషన్లో సూపర్ హిట్ను అందుకుంది.

అదేవిధంగా ఈ చిత్రంలో నాగచైతన్య నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది అని ప్రేక్షకుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా తమన్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్గా నిలుస్తుందని చెప్పవచ్చు.  థ్యాంక్యూ చిత్రం  ప్రమోషన్లు కూడా మంచి జోరుగా జరుగుతున్నాయి.   థ్యాంక్యూ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల  అంచనాలను మించి ఉంటుందని, నాగచైతన్య ఖాతాలో మరో హిట్ పడుతుందని చిత్ర యూనిట్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంతో నాగచైతన్య ఖాతాలో మరో హిట్ పడనుందా అనేది చిత్రం విడుదల వరకు  వేచిచూడాలి.


End of Article

You may also like