“ఒంటరిగా బస్సులో వెళ్తుంటే నాకు ఎదురైన సంఘటన..” అంటూ ఓ బిటెక్ అమ్మాయి పంపిన మెసేజ్.. చదివితే కన్నీళ్లొస్తాయ్..!

“ఒంటరిగా బస్సులో వెళ్తుంటే నాకు ఎదురైన సంఘటన..” అంటూ ఓ బిటెక్ అమ్మాయి పంపిన మెసేజ్.. చదివితే కన్నీళ్లొస్తాయ్..!

by Anudeep

Ads

నా పేరు వర్ణ.. బి టెక్ చదువుతున్నా.. ఎగ్జామ్స్ పూర్తయ్యి కాలేజీ కి సెలవలు రావడం తో.. మా ఊరెళ్ళిపోయాను. సెలవలు పూర్తయ్యాకా.. మళ్ళీ కాలేజీ కి రావాలంటూ అందరికి నోటిఫికేషన్ వచ్చింది. మా ఊరి నుంచి హైదరాబాద్ లో ఉన్న మా కాలేజీ హాస్టల్ కి రావాలంటే కనీసం 14 గంటలైనా పడుతుంది. అందుకే సాయంత్రం బస్ ఎక్కితే.. ఉదయాన్నే హైదరాబాద్ లో దిగేలా ప్లాన్ చేసుకున్నాను.

Video Advertisement

representative image source: a screenshot from “React” short film

నేను బుక్ చేసుకున్న బస్సు సెమి స్లీపర్ బస్సు. సెమి స్లీపర్ బస్సులో వెనకగా సీటింగ్ కూడా ఉంటుంది. నా సీటు కూడా వెనకాల వరుస లోనే ఉంది. నా పక్క సీటు లో ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడు. ఎవరా అని చూస్తే అతను మా సీనియర్. తనను పలకరించి నా సీటులో నేను కూర్చున్నాను. నా వెనక సీటులో కూడా ఓ పాతికేళ్ల కుర్రాడు, అతని పక్కన ఓ అంకుల్ కూర్చుని ఉన్నారు.

girl in bus 2

representative image

బస్సు బయలు దేరి ఊరి పొలిమేర దాటింది. లైట్స్ కూడా ఆఫ్ చేసాక అంతా నిశ్శబ్దం అలుముకుంది. నేను కూడా మంచి నిద్రలోకి వెళ్ళిపోయాను. ఉన్నట్లుండి ఊపిరి ఆడడం కష్టమైంది. గుండెల మీద ఏదో బరువు గా అనిపించింది. అందుకే ఊపిరాడడం కష్టం గా ఉందని అర్ధమైంది. కళ్ళు తెరచి చూసేసరికి నా గుండెలపైన వెనకాల అబ్బాయి చెయ్యి ఉంది.

girl in bus 1

representative image

అతను చెస్ట్ ను గట్టి గా నొక్కుతున్నాడు అని అర్ధమైంది. అందుకే నాకు మెలకువ వచ్చింది. ఒక్కసారి గా అరిచేసాను.. “ఏమి చేస్తున్నావ్ రా”? అంటూ ఆ అబ్బాయిని దబాయించేసాను. దానితో ఆ అబ్బాయ్ వెనక్కి జరిగి సైలెంట్ గా పడుకుండిపోయాడు. నేను గట్టి గా అరవడం తో ఆ పక్కన అంకుల్ లేచి ఏమైందమ్మా? అని అడిగాడు. నేను చెప్పలేకపోయాను. ఆ అబ్బాయి “ఏమి లేదంకుల్.. ఈ అమ్మాయి కావాలనే సీన్ క్రియేట్ చేస్తోంది” అంటూ చెప్పాడు.

girl in bus 4

representative image

ఆ అబ్బాయి అంత తప్పు చేసి కూడా.. తప్పేమి లేదన్నట్లు ప్రవర్తించడం చూసి షాక్ కి గురయ్యాను. ఆ బస్సు లో అంతమంది ఉన్నారు.. నేను అంత గట్టి గా అరిచినా, కనీసం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇలాంటి సమాజం లోనా నేను ఉన్నది అంటూ సిగ్గుపడ్డాను. ఒంటరి గా ప్రయాణిస్తున్న నాలాంటి యువతులకు ఇలాంటి సంఘటనలు ఎదురైనా.. మాట్లాడే అవకాశం లేదు.

girl in bus 5

representative image

పక్కన ఉన్న నా సీనియర్ నాకు కొంత సపోర్ట్ చేసినా.. ఆ అబ్బాయి ఏ తప్పు చెయ్యనివాడికి మల్లే నిద్రపోవడం తో.. ఏమి చేయలేకపోయాడు. కనీసం ఇంత జరుగుతున్నా.. బస్సు లో ఒక్కరు కూడా పట్టించుకోకుండా నిద్రపోవడం చూస్తే మాత్రం నాకు సమాజం పై అసహ్యం కలిగింది. ఈ సంఘటన గురించి ఇప్పటివరకు ఇంట్లో కూడా చెప్పలేదు.. నాలా మరో అమ్మాయి భయపడకూడదు.. ధైర్యం గా ఇలాంటివాళ్ళని ఎదుర్కోవాలని కోరుకుంటున్నా.

అతను చెస్ట్ ను గట్టి గా నొక్కుతున్నాడు అని అర్ధమైంది….”ఏం చేస్తున్నావు రా?” అనేసరికి..


End of Article

You may also like