Ads
లతా మంగేష్కర్ ఇటీవలే ఈ లోకాన్ని వీడి వెళ్లారన్న వార్తని అభిమానులు ఇంకా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ అనారోగ్యంతో నిన్న మృతి చెందిన సంగతి విదితమే. అయితే.. దాదాపు 60 ఏళ్ల క్రితమే ఆమె గొంతు నులమడానికి ఎవరో కుట్ర పన్నారు.
Video Advertisement
1962 వ సంవత్సరంనాటికి లతా మంగేష్కర్ వయసు 33 సంవత్సరాలు. ఓ రోజు ఉన్నట్లుండి ఆమెకు తీవ్ర అస్వస్థతకి గురి అయ్యారు. ఆమె హిందీలో బాగా పాపులర్ అవుతున్న ఆ క్రమంలో ఆమె గొంతునులిమేయాలని చూసారు. ఈ కుట్ర గురించి వెటరన్ హిందీ రైటర్ పద్మ సచ్ దేవ్ “ఐసా కహాసే లావూ” అనే పుస్తకంలో రాసుకొచ్చారు. దీనిగురించి ఆమె స్వయంగా చెప్పారని తెలిపారు.
“ఓ రోజు ఉన్నట్లుండి లతా వాంతులు చేసుకున్నారట. ఆకుపచ్చ రంగులో వాంతి అవడంతో అందరు కంగారు పడ్డారు. విపరీతమైన కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయారు. వెంటనే ఆమె వ్యక్తిగత వైద్యుడిని తీసుకొచ్చారు.” ఆమె కదిలే పరిస్థితిలో లేకపోవడంతో సదరు వైద్యుడు X -ray మెషిన్ ను కూడా తీసుకుని వచ్చారు. ఆమె నొప్పిని భరించలేకపోవడంతో ఆమెకు మత్తు ఇంజక్షన్ ని చేసారు. మూడు రోజుల పాటు ఆమె మృత్యువుతో పోరాడుతూనే ఉంది. పది రోజుల తర్వాత ఆమె కొంచం రికవర్ అవుతోంది అన్నట్లుగా లక్షణాలు కనిపించాయి. ఆమెకు ఎవరో స్లో పాయిజన్ ఎక్కించారని ఆ వైద్యుడు తేల్చారు..
కానీ, అంతలోనే ఆమె వంటవాడు వేతనం కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. దీనితో అందరు సదరు వంటవాడిని అనుమానించారు. అయితే అతనితో ఈ పని ఎవరు చేయించారు..? ఎందుకు చేయించారు..? అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు. పోటీదారులు ఈ పని చేయించారా..? ఎవరైనా శత్రువులా అన్న విషయం మాత్రం ఈనాటికి మిస్టరీ గానే మిగిలిపోయింది.
తరువాత ఆమె పూర్తిగా కోలుకున్నాక కూడా సరిగా ఆహరం తీసుకోలేకపోయింది. తీసుకొనే పరిస్థితి లేదు. ఐస్ క్యూబ్స్ వేసుకుని సూప్ ని మాత్రం తాగేది. అయితే ఈ పని ఎవరు చేసారు అని లతా మంగేష్కర్ దర్యాప్తు చేయించారా? లేదా అన్న సంగతి కూడా తెలియదు. ఈ విషయం గురించి ఆమె ఎవరితోనూ చర్చించలేదు. దాదాపు మూడు నెలల పోరాటం తర్వాత తిరిగి ఆమె పాడడం ప్రారంభించింది. ఆమె సన్నిహితుల్లో మాత్రం ఆమె ఏమవుతుందో అనే భయం ఉండేది.
ఈ చేదు అనుభవాల గురించి ఆమె ఇండియన్ జర్నలిస్టులతో పంచుకోలేదు. ఓ లండన్ బేస్డ్ ఫిలిం రచయిత మున్ని కబీర్ తో మాత్రం పంచుకుంది. అతను లతా చెల్లెలు ఉషా మంగేష్కర్ తో కూడా చర్చించి.. నిజాలు నిర్ధారించుకున్నాకే ఈ సంఘటనల గురించి రాసారు. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత బాలీవుడ్ పాటల రచయిత ఉదయాన్నే లత ఇంటికి వచ్చేవారు. ఆమె తినే ఆహారాన్ని ముందుగా ఆయన తిని ఆ తరువాత ఆమెకు పెట్టేవారు. కాలక్రమంలో ఆమె పాట మరింత మాధుర్యాన్ని సంతరించుకుని దేశం నలుమూలలా విస్తరించింది.
End of Article