తనకు నచ్చినప్పుడే ప్రేమ గా ఉండేది..దగ్గరకెళితే కస్సుమనేది.. కారణమేంటో తెలిసాక గుండెముక్కలైంది..నేనేమి చేయాలి..?

తనకు నచ్చినప్పుడే ప్రేమ గా ఉండేది..దగ్గరకెళితే కస్సుమనేది.. కారణమేంటో తెలిసాక గుండెముక్కలైంది..నేనేమి చేయాలి..?

by Mohana Priya

Ads

పెళ్లంటే నూరేళ్ళ పంట. ఆ పంట ప్రతిఫలాన్ని నూరేళ్లు అనుభవించాలంటే మాత్రం భార్య భర్తల మధ్య సఖ్యత తప్పనిసరిగా ఉండాలి. భార్య భర్త లిద్దరు కీచులాడుకున్నా, కిచకిచలాడుకున్నా వారిద్దరి మధ్య అన్యోన్యత ఉంటె ఏ సంసారం నావ అయిన తీరం చేరిపోతుంది. అయితే, పెళ్లి అయిన కొత్తలో ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది.

Video Advertisement

angry wife

representative image

ఒకరి వ్యక్తిత్వాలు ఒకరికి అర్ధం అయిన తరువాత వారిద్దరి మధ్య మరింత ప్రేమ పెరుగుతుంది. అయితే అర్ధం కాకపొతేనే తంటా మొదలవుతుంది. అయితే, ఓ భర్త మాత్రం తన భార్య సంగతి అర్ధం అయ్యాక మనసు విరిగిపోయింది అని చెబుతున్నాడు. తనకేమి చేయాలో తెలియడం లేదని సలహా ఇవ్వాలని కోరుతున్నాడు.. ఈరోజుల్లో.. మహిళా సాధికారత కి, మహిళా అధికార వాంఛ కి మధ్య తేడా ఉండడం లేదు. సాధికారిత పేరిట.. చాలా మంది అమ్మాయిలు తమ హక్కుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. భర్త ప్రేమ గా ఉంటున్నా..అధికారం చెలాయించే భార్యలు చాలా మందే ఉన్నారు.

angry wife 4

representative image

నా భార్య కూడా అలానే ఇబ్బందులు పెట్టేది. దగ్గరికెళ్ళినప్పుడల్లా చిరాకు పడుతూ ఉండేది. అయిన దానికి, కాని దానికి గొడవలు పెట్టుకునేది. ఈ గొడవల వలన ఆమెతో కనీసం మనస్పూర్తి గా కనీసం మాట్లాడలేకపోయేవాడిని. నేను తనను ఎంత ప్రేమ గా చూసుకుంటున్నా తన ఫామిలీ మెంబెర్స్ కి మాత్రం నేను కష్టాలు పెడుతున్నట్లు చెప్పేది. లేని పోనీ అబద్ధాలను అప్పటికప్పుడు అల్లేసేది. దీనితో నాకు మనసు విరిగిపోయింది. ఇలా ఏడాది గడిచిపోయింది.

angry wife 3

representative image

ఓ సారి ఆమె తన ఫ్రెండ్స్ ప్రెగ్నంట్ అయ్యారని తెలుసుకుని..తనకు కూడా పిల్లలు కావాలని కోరుకుంది. అప్పటి నుంచి నాకు దగ్గరవ్వాలని ప్రయత్నించేది. తనకి నచ్చినప్పుడు నాకు దగ్గరవడం.. నేను దగ్గరికెళ్తే మాత్రం కసురుకోవడం చేసేది. కొన్ని రోజులకు నాక్కూడా అర్ధం అయిపొయింది. కేవలం పిల్లల కోసమే తాను నా దగ్గరకి వస్తోందన్న సంగతి అర్ధం అయ్యాక మనసు ముక్కలైంది.

angry wife 2

representative image

మనసు పంచుకోలేనపుడు.. శరీరం పంచుకుని ఏమి లాభం..? బయట అందరితో గొప్పలు చెప్పుకుని.. నా మనసుని మాత్రం అర్ధం చేసుకోలేని మనిషి తో ప్రేమ ను పంచుకోగలనా..? సఖ్యతే లేని మా ఇద్దరికి పిల్లలు పుడితే..వారి పరిస్థితి మరింత అధ్వాన్నం అవుతుంది. డివోర్స్ తీసుకుందామనుకుంటే.. ఆమె ను చూస్తేనే భయమేస్తోంది. ఏ అభాండాలు మీద వేస్తుందో అని.. కుటుంబ పరువు పోతుంది.. నాకు ఏమి చేయాలో తెలియడం లేదు.. ఈ సమస్య నుంచి బయటపడటానికి తగిన పరిష్కారం ఇవ్వగలరు.

Note: Images used in this post are for reference purposes only. They are not the actual characters.


End of Article

You may also like