Virupaksha Review : “సాయి ధరమ్ తేజ్” నటించిన విరూపాక్ష హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Virupaksha Review : “సాయి ధరమ్ తేజ్” నటించిన విరూపాక్ష హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : విరూపాక్ష
  • నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్.
  • నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్
  • దర్శకత్వం : కార్తీక్ దండు
  • సంగీతం : అజనీష్ లోకనాథ్
  • విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2023
virupaksha movie review

Virupaksha Movie Review in Telugu

Virupaksha Movie Story స్టోరీ :

1990లో రుద్రవనం అనే ఒక ఊరిలో ఈ సినిమా మొదలవుతుంది. అక్కడ ఒక జంటని వారు మంత్రాలు వేసి పిల్లలని చంపుతున్నారు అనే కారణంగా చంపేస్తారు. వారిలో మహిళ పుష్కరకాలం తర్వాత ఈ ఊరు అంతం అయిపోతుంది అని శాపం ఇస్తుంది. ఆమె అన్నట్టుగానే పుష్కరకాలం తర్వాత ఊరిలో సమస్యలు రావడం మొదలవుతాయి. అక్కడ ఉన్న జనాలు వారంతట వారే ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతూ ఉంటారు.

Video Advertisement

virupaksha movie review

ఈ ఊరిలో జరిగే జాతరకి సూర్య (సాయి ధరమ్ తేజ్) వస్తాడు. అదే ఊరిలో నందిని (సంయుక్త) కూడా ఉంటుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ఊరిలో జరిగే సమస్యల మధ్యలో సూర్య కూడా చిక్కుకోవాల్సి వస్తుంది. అప్పుడు సూర్య ఏం చేశాడు? ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు? ఆ ఊరిలో అలా అందరూ చనిపోవడానికి కారణం ఏంటి? వారికి ఎలాంటి సంఘటనలు ఎదురు అయ్యాయి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

Virupaksha Movie Review: విరూపాక్ష రివ్యూ :

ముందు కమర్షియల్ సినిమాల్లో ఎక్కువగా నటించినా కూడా ఆ తర్వాత కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల వైపు తన దారి మళ్లించి ఒక మంచి నటుడిగా కూడా నిరూపించుకుంటున్నారు సాయి ధరమ్ తేజ్. కొద్ది సంవత్సరాల క్రితం రిపబ్లిక్ సినిమాలో నటించారు. ఆ తర్వాత చాలా టైం వరకు సాయి ధరమ్ తేజ్ సినిమాలు విడుదల అవ్వలేదు. ఇప్పుడు మళ్లీ విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇది ఒక థ్రిల్లర్ సినిమా అని అర్థం అయిపోతుంది.

virupaksha movie review

సినిమా మొదటి నుండి కూడా అసలు ఏం జరుగుతోంది అనే ఆసక్తితోనే నడుస్తుంది. స్క్రీన్ ప్లే కూడా ఒక హారర్ సినిమాకి ఎలాగైతే ఉండాలో అలాగే ఉంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ని చూస్తే చాలా కొత్తగా కనిపిస్తారు. నటన విషయంలో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు అనిపిస్తుంది.

virupaksha movie review

చాలా సీరియస్ సీన్స్ లో అంతకుముందు సినిమాల కంటే ఈ సినిమాలో చాలా బాగా నటించారు. కానీ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచే పాత్ర మాత్రం సంయుక్త పాత్ర. కేవలం పాటలకి మాత్రమే కనిపించకుండా, సినిమాలో ఒక మంచి బలం ఉన్న క్యారెక్టర్ చేశారు. అందులోనూ ఎమోషనల్ సీన్స్ లో ఇంకా బాగా నటించారు. కానీ హీరో, హీరోయిన్ కి మధ్య వచ్చే సీన్స్ మాత్రం సినిమా సస్పెన్స్ ని అడ్డుకున్నట్టు అనిపిస్తాయి.

virupaksha movie review

అంతే కాకుండా అవి కొంచెం సాగదీసినట్టుగా కూడా ఉన్నాయి. మిగిలిన నటీనటులు అందరూ వారి పాత్రలకి తగ్గట్టుగా నటించారు. పాటలు కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి. సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ పెద్ద హైలైట్ అయ్యాయి. సినిమాలో మరొక హైలైట్ లొకేషన్స్. సినిమా చూస్తున్నంత సేపు కూడా రుద్రవనం అనే ఒక ఊరిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • ఎంచుకున్న కాన్సెప్ట్
  • నిర్మాణ విలువలు
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • సినిమాలో వచ్చే ట్విస్ట్ లు

మైనస్ పాయింట్స్:

  • హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్
  • ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్

రేటింగ్ :

3.25 / 5

ట్యాగ్ లైన్ :

ఇటీవల వచ్చిన సినిమాల్లో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు రాలేదు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారిని ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఈ సంవత్సరం వచ్చిన మంచి సినిమాల్లో ఒకటిగా విరూపాక్ష సినిమా నిలుస్తుంది.

Read Also: VIRUPAKSHA MOVIE HEROINE SAMYUKTHA MENON IMAGES, AGE, BIOGRAPHY, MOVIES, FAMILY DETAILS

watch video :


End of Article

You may also like